Sampath Kumar | ఆర్ఎస్ ప్రవీణ్.. ప్రవర్తన మార్చుకో.. లేదంటే బీఆర్ఎస్ డస్ట్‌బిన్‌లో డస్ట్ పేపర్ అవుతవ్
Sampath Kumar | ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవర్తనకు ఆయన చదువుకు పొంతన లేకుండా పొందిందని.. ఇలానే కొనసాగితే బీఆర్ఎస్ డస్ట్‌బిన్‌లో డస్ట్ పేపర్ అవుతారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. ఒక సోదరుడిగా ఆయనకు సలహా ఇస్తున్నానన్నారు.
- నీ చదువుకు, ప్రవర్తనకు పొంతనే లేదు
- కేసీఆర్, కేటీఆర్ నిన్ను వాడుకొని వదిలేస్తరు
- ఒక సోదరుడిగా సలహా ఇస్తున్నా
- మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
Sampath Kumar | త్రినేత్ర.న్యూస్: ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవర్తనకు ఆయన చదువుకు పొంతన లేకుండా పొందిందని.. ఇలానే కొనసాగితే బీఆర్ఎస్ డస్ట్‌బిన్‌లో డస్ట్ పేపర్ అవుతారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. ఒక సోదరుడిగా ఆయనకు సలహా ఇస్తున్నానన్నారు. కేసీఆర్, కేటీఆర్ చాలా మందిని వాడుకొని పని అయిపోయాక డస్ట్‌బిన్‌లో పడేసిన చరిత్ర ఉందన్నారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్‌కుమార్‌పై విమర్శలు గుప్పించారు. కాల్వకుంట్ల కాగితాన్ని చూసి చదవటం తప్ప ఏమైనా విజ్ఞతతో మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.
మేం జాతికి ఉపయోగపడేవాళ్లం..
జాతిని ఉపయోగించుకునే నాయకుడు నువ్వు. జాతికి ఉపోయోగపడే నాయకులం మేము. మీనాక్షికి ఒక న్యాయం, రేవంత్‌కు ఒక న్యాయమా.. అని ఆర్ఎస్ ప్రవీణ్ అంటున్నాడు. రేవంత్ రెడ్డి 2 ఓట్లు ఉపయోగించుకుంటే అప్పుడే తెలిసిపోతుంది. రెండు ఓట్లు వెయ్యాలి అంటే హెలికాఫ్టర్‌లో వెళ్లాలి. విమర్శించడానికైనా ఒక లిమిట్ ఉంటుంది.
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆదర్శన్‌నగర్‌లో ఓటు చూపించారు. ఎంపీ ఎన్నికలో అలంపూర్‌లో ఓటు ఉందని అఫిడవిట్‌లో చూపించారు. ఆయనది ఒక్కటే కాదు.. కుటుంబం మొత్తానికి 2 ఓట్లు చూపించారు. ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే ఎవరిని ముందు అరెస్ట్ చేయాలి? కల్వకుంట్ల కుటుంబ ఆట వస్తువుగా ప్రవీణ్‌ను రేవంత్ రెడ్డి మీదికి వదిలారు. ఆర్ఎస్ ప్రవీణ్ 9 ఏళ్ళు ఒకటే డిపార్టుమెంటులో ఎలా పనిచేశాడు. గులాంగిరి చేసావ్ కాబట్టే కొనసాగ గలిగావ్. ఫామ్‌హౌస్ ముందు మోకరిల్లి ఎంపీ టికెట్ తెచ్చుకున్నావ్. సామాజిక న్యాయం కోసే పనిచేసే ఉద్యమ కారులని పిట్టల్లా కాల్చిన నువ్వా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది? పెద్ద వాళ్ల గురించి మాట్లాడితే పెద్ద అక్షరాలతో ప్రచారం జరుగుతుంది అని అపోహ పడొద్దు అని సంపత్‌కుమార్ హితవు పలికారు.
తాజావార్తలు
- ●Woman Reservations | చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి.. టీ పీసీసీ చీఫ్‌కు మహిళా జేఏసీ విజ్ఞప్తి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..
- ●Bhatti Vikramarka | గోదావరి జలాల వినియోగానికి ప్రత్యేక కార్యాచరణ
- ●Mega Job Mela | జూలై 21న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
- ●NPS | ఎన్పీఎస్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ఆర్డీఏ కొత్త టూల్.. కార్పస్ ఎంత అవుతుందో ఈజీగా లెక్కించవచ్చు..
- ●Vaakiti Srihari | కాంగ్రెస్ అంటేనే పని చేసే పార్టీ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల ముఖాముఖీ

Woman Reservations | చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి.. టీ పీసీసీ చీఫ్‌కు మహిళా జేఏసీ విజ్ఞప్తి

Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..

Bhatti Vikramarka | గోదావరి జలాల వినియోగానికి ప్రత్యేక కార్యాచరణ

Mega Job Mela | జూలై 21న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా




