త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Short Circuit | పేలిన ప్రిజ్‌.. కాలి బూడిదైన రూ.20 ల‌క్ష‌ల న‌గ‌దు

Fire Accident | వికారాబాద్ (Vikarabad) జిల్లా దౌల్తాబాద్ మండ‌లం బండివాడ‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్‌తో (Short Circuit) ఫ్రిజ్ పేల‌డంతో ఇంట్లో దాచిన రూ.20 లక్షల నగదు, బంగారం, వెండి అగ్నికి ఆహుతయ్యాయి.

G

Telangana | Published On Sep 27, 2026, 10.22 am IST

Short Circuit | పేలిన ప్రిజ్‌.. కాలి బూడిదైన రూ.20 ల‌క్ష‌ల న‌గ‌దు
Advertisement

Fire Accident | త్రినేత్ర న్యూస్‌: వికారాబాద్ (Vikarabad) జిల్లా దౌల్తాబాద్ మండ‌లం బండివాడ‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్‌తో (Short Circuit) ఫ్రిజ్ పేల‌డంతో ఇంట్లో దాచిన రూ.20 లక్షల నగదు, బంగారం, వెండి అగ్నికి ఆహుతయ్యాయి. బండివాడ‌కు చెందిన అంజప్ప మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఆయ‌న‌కు భార్య‌, కుమారుడు ఉన్నారు. ఇటీవల తాము ఉంటున్న ఇంటిని కూల్చేసి, నూతన గృహ నిర్మాణ పనులు మొద‌లుపెట్టారు. దీంతో ఇంటి పక్కనే చిన్న గుడిసె వేసుకుని అందులో ఉంటున్నారు.

ఇంటి నిర్మాణం కోసం మేడ్చల్‌ జిల్లా బొల్లారంలోని ప్లాటును విక్రయించారు. అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బు రూ.20 లక్షలు గుడిసెలోని బీరువాలో పెట్టారు. అయితే గుడిసెలోని ఫ్రిజ్‌ ఒక్కసారి పేలిపోవ‌డంతో మంట‌లు చెల‌రేగాయి. గమనించిన చుట్టు పక్కల వారు నీళ్లు చల్లి ఆర్పేశారు. అయితే అప్పటికే బీరువా కాలిపోవ‌డంతో అందులో ఉన్న రూ.20 లక్షల నగదు, ఐదు తులాల బంగారు, వెండి ఆభరణాలు బూడిద‌య్యాయి. స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement