త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు యువ‌కులు మృతి, తీవ్రంగా గాయ‌ప‌డిన ఐదుగురు

Road Accident | హుజూరాబాద్ మండ‌లం రంగాపూర్ శివారులో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్లివ‌స్తుండ‌గా జాతీయ ర‌హ‌దారిపై అదుపుత‌ప్పిన కారు.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు యువ‌కులు మ‌ర‌ణించారు.

G

Telangana | Published On Oct 24, 2026, 9.26 am IST

Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు యువ‌కులు మృతి, తీవ్రంగా గాయ‌ప‌డిన ఐదుగురు
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్‌: హుజూరాబాద్ మండ‌లం రంగాపూర్ శివారులో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్లివ‌స్తుండ‌గా జాతీయ ర‌హ‌దారిపై అదుపుత‌ప్పిన కారు.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు యువ‌కులు మ‌ర‌ణించారు. మ‌రో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండం (Ramgundam) ప్రాంతానికి చెందిన ఏడుగురు యువ‌కులు విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి కారులో వెళ్లారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న వారు స్వ‌గ్రామానికి తిరుగుప‌య‌ణ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో శ‌నివారం తెల్ల‌వారుజామున హుజురాబాద్ (Huzurabad) మండలం రంగాపూర్ స‌మీపంలో 563వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వారి కారు ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్ర‌మాదంలో రామ‌గుండానికి చెందిన బ‌ట్టారి అర‌వింద్‌, మ‌చ్చ సాయి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఎరుకల సాయికృష్ణ, మచ్చ ఆదర్శ్, ముఖియా, వివేక్, శ్రీకర్‌ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన‌వారిని హుజూరాబాద్ ఏరియా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం (MGM) హాస్పిట‌ల్‌కు తీసుకెల్లారు. వారిలో ఇద్దరిని హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క‌ర్ణాట‌క‌లో రోడ్డు ప్ర‌మాదం..

మ‌రో ఘ‌ట‌న‌లో క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో సంగారెడ్డి జిల్లా మానూర్‌కు చెందిన ఇద్ద‌రు మ‌ర‌ణించారు. బీద‌ర్ జిల్లా బ‌స‌వ క‌ల్యాణి వ‌ద్ద కారు, బ‌స్సు ఢీకొన్నాయి. దీంతో ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో నాలుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.

Advertisement
Advertisement