త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Veg Only | లోక్‌భ‌వ‌న్‌లో మాంసాహారంపై నిషేధం.. వివాదంలో కేర‌ళ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌

Veg Only | కేరళ నూతన గవర్నర్ ఓం ప్ర‌కాష్ మాథుర్ (Om Prakash Mathur) వివాదంలో చిక్కుకున్నారు. లోక్‌భ‌వ‌న్‌లో మాంసాహారంపై (Veg Only) నిషేధం విధిస్తూ ఆయ‌న మౌఖిక ఆదేశాలు జారీచేశారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంపై అధికార కాంగ్రెస్‌, విప‌క్ష సీపీఎం నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

National | Published On Oct 24, 2026, 10.32 am IST

Veg Only | లోక్‌భ‌వ‌న్‌లో మాంసాహారంపై నిషేధం.. వివాదంలో కేర‌ళ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌
Advertisement

Veg Only | త్రినేత్ర న్యూస్‌: కేరళ నూతన గవర్నర్ ఓం ప్ర‌కాష్ మాథుర్ (Om Prakash Mathur) వివాదంలో చిక్కుకున్నారు. లోక్‌భ‌వ‌న్‌లో మాంసాహారంపై (Veg Only) నిషేధం విధిస్తూ ఆయ‌న మౌఖిక ఆదేశాలు జారీచేశారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంపై అధికార కాంగ్రెస్‌, విప‌క్ష సీపీఎం నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంఘ్ పరివార్ ఎజెండాను అమలు చేస్తున్నారంటూ మండిప‌డ్డాయి. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా (Keralam Governor) బాధ్యతలు స్వీకరించిన మొద‌టి రోజే ఓం ప్రకాష్ మాథుర్‌ను వివాదం చుట్టుముట్ట‌డం గ‌మ‌నార్హం.

అక్టోబ‌ర్ 23న కేరళ 29వ బాధ్యతలు స్వీకరించిన మాథుర్‌.. లోక్‌భ‌వ‌న్ కిచెన్‌లో (Lok Bhavan Kitchen) మాంసాహార వంట‌కాలు వండ‌కూడ‌ద‌ని, వ‌డ్డించ‌కూడ‌ద‌ని సిబ్బందిని ఆదేశించిన‌ట్లు మీడియాలో వార్త‌లు వెలువ‌డ్డాయి. ఆయన శాకాహారి (Strict Vegetarian) కావడంతో రాజస్థానీ శైలి వంటకాలను తయారు చేయడానికి ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి వంటవాళ్లను కూడా రప్పించ‌డం విశేషం.

కాగా, ఈ వ్య‌వ‌హారంపై గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌య వ‌ర్గాలు స్ప‌దిస్తూ.. శాకాహారి కావ‌డంతో ఈ మార్పు చేయాల‌ని కోరార‌ని, అయితే రాజ్ భవన్ సిబ్బంది ఆహారపు అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు కేవలం గవర్నర్, ఆయన వ్యక్తిగత సిబ్బంది (Personal Staff) కోసం భోజనం తయారు చేసే ప్రధాన వంటగదికి మాత్రమే పరిమిత‌మని వెల్ల‌డించారు. రాజ్‌భవన్‌లోని ఇతర సాధారణ ఉద్యోగులు తమ ఇండ్ల‌ నుంచి మాంసాహారం తెచ్చుకోవడానికి లేదా బయట తినడానికి ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు.

గ‌ర్న‌ర్ నిర్ణ‌యంపై విమ‌ర్శ‌ల వెల్లువ‌..

కేరళ సంస్కృతిలో భాగమైన ఆహారపు అలవాట్లపై ఈ నిర్ణయం గొడ్డలిపెట్టు అని ప్రతిపక్ష కాంగ్రెస్, లెఫ్ట్ (LDF) కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గవర్నర్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేరళ విభిన్న ఆహార సంస్కృతి కలిగిన తీరప్రాంత రాష్ట్రమని, ఇక్కడి ప్రజలకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లను నియంత్రించే ఎలాంటి ప్రయత్నాన్నైనా అంగీకరించబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇతరుల స్వేచ్ఛను హరించడం సంఘ్ పరివార్ (Sangh Parivar) `కాషాయ ఎజెండా`లో భాగమేనని ఆరోపించారు. గవర్నర్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

మా ఆహారం మా ఇష్టం..

ఎవరు ఏం తినాలి, ఏం ధరించాలి, ఏ భాష మాట్లాడాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నిత్తల (Ramesh Chennithala) అన్నారు. మాకు నచ్చిన ఆహారాన్ని మమ్మల్ని తిననివ్వండి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో శాకాహారం లేదా మాంసాహారం ఎంచుకునే ప్రజాస్వామ్య హక్కు అందరికీ ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ (MV Govindan) చెప్పారు. ఈ హక్కును లాక్కోవడానికి సంఘ్ పరివార్ మతపరమైన ధ్రువీకరణకు పాల్పడుతున్న‌దని విమ‌ర్శించారు. ఆహారాన్ని కూడా ఒక 'మత ఆయుధంగా' మారుస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement