త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhavani Devotees | దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా.. భ‌వానీ భ‌క్తుల‌ను ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మ‌ర‌ణం

Bhavani Devotees | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ (Kakinada) జిల్లా క‌త్తిపూడిలో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ద‌ర్శనానికి వెళ్తున్న భ‌వానీ భ‌క్తుల‌ను (Bhavani Devotees) కారు ఢీకొట్టింది. దీంతో న‌లుగురు భ‌వానీ భ‌క్తులు దుర్మ‌ర‌ణం చెందారు.

G

Andhra pradesh | Published On Oct 22, 2026, 8.01 am IST

Bhavani Devotees | దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా.. భ‌వానీ భ‌క్తుల‌ను ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Bhavani Devotees | త్రినేత్ర న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ (Kakinada) జిల్లా క‌త్తిపూడిలో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ద‌ర్శనానికి వెళ్తున్న భ‌వానీ భ‌క్తుల‌ను (Bhavani Devotees) కారు ఢీకొట్టింది. దీంతో న‌లుగురు భ‌వానీ భ‌క్తులు దుర్మ‌ర‌ణం చెందారు. గురువారం తెల్ల‌వారుజామున విజయనగరం జిల్లా డెంకాడ నుంచి భవానీ భక్తులతో విజయవాడ వెళ్తున్న ప్రైవేటు బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మరమ్మతుల కోసం డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపారు. అందులోని భవానీ భక్తులు చాయ్‌ తాగేందుకు కిందికి దిగి పక్కనే ఉన్న దుకాణం వైపునకు న‌డుచుకుంటూ వెళ్తున్నారు.

అదేస‌మ‌యంలో వేగంగా వ‌చ్చిన స్కార్పియో వాహనం వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు భవానీ భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల‌ను ద‌వాఖాన‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో ఒక‌రు మ‌ర‌ణించారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులను సిరిగిడి ఎర్రయ్య (35), తంలింగాల సీతారాం (36), తాటిపూడి వరప్రసాద్ (36), బోనుల రమణ (52)గా గుర్తించారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement