త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Singh | రాష్ట్రంలో క‌రువు ప‌రిస్థితులు.. పూర్తిగా విఫ‌ల‌మైన కాంగ్రెస్ స‌ర్కార్‌: ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh | రాష్ట్రంలో తీవ్ర కరువు (Drought) పరిస్థితులు, తాగునీటి ఎద్దడి తలెత్తినప్ప‌టికీ ముందుచూపుతో వ్యవహరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) అన్నారు.

G

Hyderabad | Published On Oct 24, 2026, 11.43 am IST

Raja Singh | రాష్ట్రంలో క‌రువు ప‌రిస్థితులు.. పూర్తిగా విఫ‌ల‌మైన కాంగ్రెస్ స‌ర్కార్‌: ఎమ్మెల్యే రాజాసింగ్
Advertisement

Raja Singh | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో తీవ్ర కరువు (Drought) పరిస్థితులు, తాగునీటి ఎద్దడి తలెత్తినప్ప‌టికీ ముందుచూపుతో వ్యవహరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) అన్నారు. కరువు పరిస్థితులు వచ్చిన త‌ర్వాత‌.. ప్రతి చుక్క నీటిని జాగ్ర‌త్త‌గా వాడుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పడంతోనే అంతా అప్ర‌మ‌త్త‌మ‌య్యార‌ని తెలిపారు. అయితే, ముందస్తుగా అంచనాలు వేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింద‌ని మండిప‌డ్డారు.

కాంగ్రెస్ స‌ర్కార్ (Congress Govt) అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా చెరువులను బాగు చేయలేదని, కనీసం కేజీ మట్టి కూడా తీయలేద‌ని విమ‌ర్శించారు. చెరువుల్లో కనీసం 10 అడుగుల మేర మట్టిని పూడికతీత తీస్తే నీరు నిల్వ ఉండేది. కానీ ఆ ఆలోచనే ప్రభుత్వానికి రాలేదని ధ్వ‌జ‌మెత్తారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొంతవరకు చెరువులను బాగు చేసింద‌న్నారు. చెరువులను కాపాడితే వర్షాలు పడకపోయినా కొంత నీటిని నిల్వ‌ చేసుకునే వాళ్లమనే ఆలోచ‌న‌ సీఎంకు కానీ, మంత్రులకు కానీ తట్టలేద‌ని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ (Hyderabad) మొత్తం కాంక్రీట్ మయమైపోయిందని, ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌ని ఆరోపించారు. భూగర్భ జలాలు అడుగంటి, వర్షాలు పడక కరెంట్ కష్టాలు, నీటి కష్టాలు (Water Crisis) వస్తాయని తెలిసినా ప్రభుత్వం కేవలం రాజకీయం చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు నీటిని ఎలా రప్పించాలనే దానిపై తక్షణమే యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.

 

Advertisement
Advertisement