త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Massive Explosion | అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

Massive Explosion | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అల్లూరి జిల్లాలో భారీ పేలుడు (Massive Explosion) సంభ‌వించింది. శనివారం ఉదయం అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు కోసం బ్లాస్టింగ్ చేప‌ట్టారు.

G

Andhra pradesh | Published On Oct 24, 2026, 10.56 am IST

Massive Explosion | అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
Advertisement

Massive Explosion | త్రినేత్ర న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అల్లూరి జిల్లాలో భారీ పేలుడు (Massive Explosion) సంభ‌వించింది. శనివారం ఉదయం అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు కోసం బ్లాస్టింగ్ చేప‌ట్టారు. దీనికోసం అమ‌ర్చిన జిలెటిన్ స్టిక్స్ (Gelatin Sticks) మిస్ ఫైర్ కావ‌డంతో అక్క‌డున్న ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు. పేలుడు ధాటికి రెండు వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. మృతుల్లో డ్రైవర్, ఇద్దరు కార్మికులు ఉండగా.. అటుగా వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తున్న‌ది. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ద‌వాఖానుకు తరలించారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు తెలుస్తున్న‌ది. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతులను విశాఖకు చెందిన సునీత (టీచ‌ర్‌), కార్మికులు దేవరాపల్లికి చెందిన మణి, చీడికాడకు చెందిన నారాయణరావు, కడపకు చెందిన పవన్‌కుమార్‌గా గుర్తించారు. మ‌రో ఇద్ద‌రి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement