త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో త‌గ్గ‌ని అస్థిర‌త‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తోపాటు ముడి చ‌మురు ధ‌ర‌లు గ‌రిష్ట స్థాయిల్లో ఉండ‌డం, ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌తో బంగారం, వెండి ధ‌ర‌లు కూడా ప్ర‌భావితం అవుతున్నాయి. గ‌త వారం మొత్తం సెష‌న్ల‌లో ఈక్విటీ, బులియ‌న్ మార్కెట్లు తీవ్ర అస్థిర‌త‌తో క‌దిలాయి.

S

Business | Published On Oct 24, 2026, 11.02 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో త‌గ్గ‌ని అస్థిర‌త‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తోపాటు ముడి చ‌మురు ధ‌ర‌లు గ‌రిష్ట స్థాయిల్లో ఉండ‌డం, ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌తో బంగారం, వెండి ధ‌ర‌లు కూడా ప్ర‌భావితం అవుతున్నాయి. గ‌త వారం మొత్తం సెష‌న్ల‌లో ఈక్విటీ, బులియ‌న్ మార్కెట్లు తీవ్ర అస్థిర‌త‌తో క‌దిలాయి. వారాంతంలో న‌ష్టాల్లో ముగిశాయి. గ‌త సెష‌న్‌లో ప్ర‌పంచ బులియ‌న్ మార్కెట్‌ల‌లో బంగారం ధ‌ర ఔన్స్‌కు 0.71 శాతం మేర ప‌త‌న‌మై 3,997 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 1.27 శాతం మేర క్షీణించి 53 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1285 పాయింట్లు త‌గ్గి 1,42,024కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,880 పాయింట్లు ప‌త‌న‌మై 1,95,719 వ‌ద్ద ముగిసింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో శ‌నివారం బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,258 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,14,064 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,42,580 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,25,800 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,000 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,070 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,04,560గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,30,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,07,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,694 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.85,552గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,06,940 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,69,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.800 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,20,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,200గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,20,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,200 గా ఉంది.

Advertisement
Advertisement