త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | ద‌వాఖాన‌కు వెళ్తుండ‌గా అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ.. రోగి, ఆమె తల్లి మృతి

Road Accident | నిర్మల్‌ (Nirmal) జిల్లాలో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. ద‌వాఖాన‌కు వెళ్తున్న‌ అంబులెన్స్‌ను లారీ (Road Accident) ఢీకొట్టింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున సోన్‌-క‌డ్తాల్ వై జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో రోగి, ఆమె తల్లి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.

G

Telangana | Published On Oct 23, 2026, 11.41 am IST

Road Accident | ద‌వాఖాన‌కు వెళ్తుండ‌గా అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ.. రోగి, ఆమె తల్లి మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్‌: నిర్మల్‌ (Nirmal) జిల్లాలో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. ద‌వాఖాన‌కు వెళ్తున్న‌ అంబులెన్స్‌ను లారీ (Road Accident) ఢీకొట్టింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున సోన్‌-క‌డ్తాల్ వై జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో రోగి, ఆమె తల్లి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.

ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా గాడిగూడ మండలం జరి గ్రామానికి చెందిన సరస్వతి (22) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆదిలాబాద్ ద‌వాఖాన‌లో చేరారు. ప‌రీక్షించిన‌ వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ (Nizamabad) ద‌వాఖాన‌కు రిఫర్‌ చేశారు. దీంతో గురువారం రాత్రి సరస్వతి, ఆమె తల్లి పారూబాయి, మరో నలుగురు బంధువులు అంబులెన్స్‌లో హాస్పిట‌ల్‌కు బయల్దేరారు.

ఈ క్ర‌మంలో కడ్తాల్ వై జంక్షన్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ.. అంబులెన్స్‌ను (Ambulance) ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన సరస్వతి ఆమె త‌ల్లి పారూ బాయి (50) ఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌ డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్షతగాత్రులను నిర్మల్‌, నిజామాబాద్ హాస్పిట‌ళ్ల‌కు తరలించారు. ఈఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement