Cold Waves | వణికిస్తున్న చలి.. రానున్న మూడు రోజులు జర జాగ్రత్త..!
Cold Waves | తెలంగాణ వ్యాప్తంగా చలి కాలం( Cold Wave ) ప్రారంభమైంది. ఎల్ నినో వల్ల పగటి పూట ఎండ దంచికొడుతున్నప్పటికీ, రాత్రి అయ్యేసరికి చలి వణికిస్తోంది. తెల్లవారుజామున మంచు కురుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది.
Cold Waves | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా చలి కాలం( Cold Wave ) ప్రారంభమైంది. ఎల్ నినో వల్ల పగటి పూట ఎండ దంచికొడుతున్నప్పటికీ, రాత్రి అయ్యేసరికి చలి వణికిస్తోంది. తెల్లవారుజామున మంచు కురుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలో వారం రోజుల క్రితం 20 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత మంగళవారం రోజున 15 డిగ్రీలకు పడిపోయింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా నిర్మల్ జిల్లాలోని కుభీరులో 14.6 డిగ్రీలుగా నమోదైంది. సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 16.1 డిగ్రీలుగా రికార్డు అయ్యింది.
ఇక రానున్న మూడు రోజుల పాటు కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జోగుళాంబ-గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదయ్యే అవకాశాలున్నట్టు వెల్లడించింది. సంగారెడ్డి, మెదక్, కుమ్రం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోయే అవకాశమున్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరి ముఖ్యంగా చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
- ●TG TET | టీజీ టెట్ నిర్వహణ తేదీ మార్పు..! ఎందుకంటే..?
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి 22 వరకు కార్తీక ఉత్సవం
- ●Horoscope | నవంబర్ 11 రాశిఫలాలు.. ఈ రాశివారికి సోదరులతో అపార్థాలు, ఊహించని ఆటంకాలు..!
- ●Bhagini Hasta Bhojanam | భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? సోదరి ఇంట్లోనే సోదరుడు ఎందుకు భోజనం చేయాలి?
- ●Telangana IVF Center Raids | అండాల సేకరణ అక్రమాలపై సర్కారు ఉక్కుపాదం.. 7 ఐవీఎఫ్ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు
- ●Priya Prakash Varrier | బోల్డ్ ఫొటోలతో వింక్ గర్ల్ రచ్చ

TG TET | టీజీ టెట్ నిర్వహణ తేదీ మార్పు..! ఎందుకంటే..?

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి 22 వరకు కార్తీక ఉత్సవం

Horoscope | నవంబర్ 11 రాశిఫలాలు.. ఈ రాశివారికి సోదరులతో అపార్థాలు, ఊహించని ఆటంకాలు..!

Bhagini Hasta Bhojanam | భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? సోదరి ఇంట్లోనే సోదరుడు ఎందుకు భోజనం చేయాలి?





