త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Land Survey | 125 ఏళ్ల తర్వాత..రాష్ట్రంలో మ‌ళ్లీ స‌మ‌గ్ర భూస‌ర్వే

Land Survey | రాష్ట్ర వ్యాప్తంగా మ‌ళ్లీ సమ‌గ్ర భూ స‌ర్వే చేప‌ట్టేందుకు కాంగ్రెస్ స‌ర్కార్( Congress Govt ) సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే పైల‌ట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ప‌లు గ్రామాల్లో చేప‌ట్టిన భూస‌ర్వే( Land Survey ) ప్ర‌క్రియ‌ను ఈ ఏడాది న‌వంబ‌ర్ లోపు పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. కొత్త‌గా మ‌ళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించ‌బోయే స‌మ‌గ్ర భూ స‌ర్వేను ఏడాదిన్న‌ర లోపు పూర్తి చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Oct 9, 2026, 5.39 pm IST

Land Survey | 125 ఏళ్ల తర్వాత..రాష్ట్రంలో మ‌ళ్లీ స‌మ‌గ్ర భూస‌ర్వే
Advertisement

భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం
ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి
7 జోన్లకు 14 మంది అధికారుల నియామకం
15 రోజుల‌కోసారి నేనే స్వ‌యంగా స‌మీక్ష చేస్తా
భూ స‌ర్వే స‌మీక్ష‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

Land Survey | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా మ‌ళ్లీ సమ‌గ్ర భూ స‌ర్వే చేప‌ట్టేందుకు కాంగ్రెస్ స‌ర్కార్( Congress Govt ) సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే పైల‌ట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ప‌లు గ్రామాల్లో చేప‌ట్టిన భూస‌ర్వే( Land Survey ) ప్ర‌క్రియ‌ను ఈ ఏడాది న‌వంబ‌ర్ లోపు పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. కొత్త‌గా మ‌ళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించ‌బోయే స‌మ‌గ్ర భూ స‌ర్వేను ఏడాదిన్న‌ర లోపు పూర్తి చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) ప్ర‌క‌టించారు. స‌మ‌గ్ర రీ భూస‌ర్వేపై శుక్ర‌వారం స‌చివాల‌యంలో స‌ర్వే ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏర్పాటు చేసిన అధికారుల‌తో భూస‌ర్వే పురోగ‌తిపై మంత్రి పొంగులేటి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 125 ఏళ్ల త‌ర్వాత స‌మ‌గ్ర భూస‌ర్వేకు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిస్తామ‌ని, స‌ర్వేలో వేగం పెంచుతామ‌న్నారు. అధికార యంత్రాంగం కూడా అత్యంత బాధ్య‌త‌తో త‌మ విధులు నిర్వ‌ర్తించాల‌న్నారు. భూస‌ర్వేను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించేందుకు ఏడు జోన్ల‌కు రెవెన్యూ, స‌ర్వే డిపార్ట్‌మెంట్ల నుంచి ఇద్ద‌రు చొప్పున మొత్తం 14 మంది అధికారులను నియ‌మించామ‌న్నారు. స‌ర్వే విష‌యంలో ప్ర‌జ‌ల స్పంద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అందుకనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

స‌ర్వే తొలి ద‌శ‌లో భాగంగా న‌క్షా లేని 365 గ్రామాల్లో.. అలాగే జిల్లాకు 70 గ్రామాల చొప్పున రీస‌ర్వే ముమ్మ‌రంగా సాగుతుంద‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 245 గ్రామాల్లో స‌ర్వే పూర్తి చేయ‌డం జ‌రిగింద‌న్నారు. మొద‌టి ద‌శ స‌ర్వేను న‌వంబ‌ర్ చివ‌రి నాటికి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వే తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌, జీపీవో, డిప్యూటీ తహసీల్దార్‌ లేదా ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర సిబ్బంది ఉంటారని వివరించారు. చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా, భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా రీ–సర్వే జరగాలని మంత్రి స్పష్టం చేశారు.

15 రోజులకోసారి స్వ‌యంగా స‌మీక్షిస్తా

రీ–సర్వే ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనద‌ని ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలని, ప్రతి 15 రోజులకు తాను స్వయంగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ భూముల సర్వే సమయంలో సరిహద్దులను గుర్తించే ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల‌ని ఆదేశించారు. రీ–సర్వే పేరుతో స్థానికంగా ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డు

రీ–సర్వేను రాష్ట్రస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. సర్వే పురోగతి, రోజువారీ పనితీరు, గ్రామాల వారీగా పూర్తయిన సర్వే, పనిచేస్తున్న సర్వే బృందాలు, ఉపయోగిస్తున్న రోవర్లు, వాటి లొకేషన్‌ వంటి వివరాలన్నీ డాష్‌బోర్డులో రియల్‌టైమ్‌లో కనిపించేలా టెక్నాలజీని వినియోగించాలని సూచించారు.

ఎర్ర‌వ‌ల్లిలో స‌ర్వే కోసం మ‌రోసారి నోటీసులు

శుక్ర‌వారం స‌చివాల‌యంలో త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మంత్రి పొంగులేటి చిట్ చాట్ చేశారు. ఎర్రవల్లిలో 385 ఎకరాలలో 45 ఎకరాలు తక్కువ ఉందని, సర్వే కోసం మ‌రోసారి నోటీసులు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఎర్రవల్లిలో అసైన్డ్ భూములు చేతులు మారాయి. వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటామ‌న్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అమరవీరులను గుర్తించి వాళ్లకు న్యాయం చేస్తామ‌న్నారు. ఎర్ర‌వ‌ల్లిలో కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా అసైన్డ్ ల్యాండ్ ఉంటే వాటిని పేద‌ల‌కు పంచుతామ‌న్నారు.

Advertisement
Advertisement