Konda Susmitha | రేవంత్.. నువ్వొచ్చినా, రేవూరి తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే
Konda Susmitha | రేవంత్ వచ్చినా, రేవూరి తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనేనని.. కచ్చితంగా నిలవడి గెలుస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డితోని రాజీనామా చేయించి ఎలక్షన్‌కు రావాలని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.
- రెండేళ్ల తర్వాతొచ్చే ఎన్నికలొద్దు.. రేవూరితో ఇప్పుడే రాజీనామా చేయించు.. నువ్వే ప్రచారం చెయ్
- కచ్చితంగా నేనే నిలవడతా.. నేనే గెలుస్తా.. అర్థమైందా!
- అనవసరంగా నన్ను రెచ్చగొట్టినవ్.. అందుకే బయటికొచ్చినా.. మాట్లాడుతున్నా.. ఇంకా బయటికి తీయాల్సినయ్ చాలున్నయ్
- రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ నడుస్తుంది
- మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
త్రినేత్ర.న్యూస్: రేవంత్ వచ్చినా, రేవూరి తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనేనని.. కచ్చితంగా నిలవడి గెలుస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డితోని రాజీనామా చేయించి ఎలక్షన్‌కు రావాలని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు. రేవూరి తరఫున రేవంత్ ప్రచారం చేసినా ఇండిపెండెంట్‌గా నిలవడి గెలుస్తానని వ్యాఖ్యానించారు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టారని.. అందుకే బయటికొచ్చి మాట్లాడాల్సి వస్తోందన్నారు. ఇంకా బయటికి తీయాల్సినయ్ చాలా ఉన్నాయన్నారు. పరకాలలో బుధవారం నిర్వహించిన కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మరికొందరి ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఊగిపోయారు.
ప్రెస్‌క్లబ్‌లో కూసుండి నీ బాగోతాలన్నీ బయటపెడతా..
నాకు కౌంటర్ ఇస్తే ప్రెస్ క్లబ్‌లో కూసుండి రేవంత్ రెడ్డి బాగోతాలు అన్నీ బయటపెడతా. రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కాగానే నీకు కళ్లు నెత్తికి ఎక్కినయా? మా దయతోనే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో గెలిచిండు. ఆరోజు నీకు సహాయం చేసిన మా నాన్న ఈరోజు నీకు కనిపించడం లేదా? రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఎందుకు.. రేవూరి ప్రకాష్ రెడ్డిని ఇప్పుడే రాజీనామా చేయమను. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవడు. రేవంత్.. నన్ను గెలికితే మీ అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతా. ఈరోజు నీ తమ్ముడి 200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే మాట్లాడా. నాకు కౌంటర్ ఇస్తే మీ స్కాములు అన్నీ బయటపెడతా. రేవంత్ రెడ్డి.. నువ్వు, నీ తమ్ముళ్లు, రాష్ట్రం మీద పడి తినడం తప్ప చేసిందేం లేదు.
36 సీట్లొచ్చినా ఎమ్మెల్సీ ఇస్తా అని మా నాన్నకు చెప్పలేదా?
మా అమ్మ సహాయంతోనే రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ కావాలని మొదట కోరుకున్నది కొండా సురేఖ.. అవునా? కాదా? సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మా ఇంటికి వచ్చి, మనకు 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని మా నాన్నకు చెప్పలేదా? చెప్పినవో లేదో మా కట్టమైసమ్మ గుడికి రా.. లేదంటే ఎల్లమ్మ గుడికాడికి రా.. అప్పుడు నేన్ జెప్తా.
వేం నరేందర్‌రెడ్డి ఏం సలహాలిచ్చిండు?
వేం నరేందర్ రెడ్డిని సలహాదారుడిగా పెట్టుకున్నావు కదా.. 3 ఏండ్లలో ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి? నీ తమ్ముడు షెల్ కంపెనీ పెడితే రూ. 200 కోట్ల విలువగల భూమిని ధారాదత్తం చేశావు రేవంత్ రెడ్డి. మీరు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు మా ఇంటికి వస్తున్నారు. తెలంగాణలో అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ నడుస్తుంది. అసలు కాంగ్రెస్ సభ్యులు ఎవరు ఆనందంగా లేరు.
పొంగు ఎక్కువ సేపు పొంగదు..
రేవంత్ రెడ్డి.. నీతో పాటు ఉన్న పొంగు (పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి) ఎక్కువ సేపు పొంగదు. నువ్వు ముఖ్యమంత్రివా లేదా ఆయన ముఖ్యమంత్రో తెలుస్తలేదు. మొన్న హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో, పొంగులేటి ఫొటో వేసుకున్నరు. కానీ అక్కడ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో వేయలేదు. బీసీలు అంటే అంత చులకననా మీకు? బీసీలను తొక్కదలుచుకున్నవా?
సంగారెడ్డిల అట్ల చెప్పి.. పరకాలల ఇట్ల చెప్తవా?
సంగారెడ్డి పోయినప్పుడు జగ్గారెడ్డికి టికెట్ రాహుల్ గాంధీ ఇస్తడని చెప్పిండు.. ఇక్కడికొచ్చినప్పుడు రేవూరికి రేవంతే టికెట్ ఇచ్చినట్టు చెప్తాండు. 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇయ్యరాదు ఇగ. నువ్ సీల్డ్ కవర్ సీఎంవే. నీ సీటు కాపాడుకోవాలంటే కొంచెం నిబద్దతతోటి ఉండు.
డైపర్లు వేసుకొనే రేవూరికి ఎమ్మెల్యే టిక్కెట్టా?
ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్. మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్. ఏంది ఇది? రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ప్రజలు ఒకసారి ఓడగొట్టారు. అలాంటిది పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని ఇప్పుడు ఎలా అంటాడు? రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అవ్వడానికి సహాయపడ్డ దయాసాగర్ రావు, షబ్బీర్ అలీలకు ఇప్పుడు ఆయన అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు అని కొండా సుష్మిత వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించాలి.. 16 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోరా?
ఆగస్టు 19, 2026

Telangana Govt | సినిమా టికెట్ రేట్లు పెంచితే 20శాతం సంక్షేమానికి.. సర్కారు కీలక ఆదేశాలు..!
ఆగస్టు 19, 2026

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
- ●నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!
- ●State Museum | వైఎస్సార్ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం
- ●Ritika Nayak | కథ నచ్చితేనే ఓకే.. రితికా నాయక్ ప్లాన్ ఇదే
- ●WhatsApp Cyber Fraud | వాట్సప్‌లో 'బాస్' మెసేజ్.. ఏకంగా రూ.1 కోటి కొల్లగొట్టిన కేటుగాడు, పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్
- ●January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’.. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్..

CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు

నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!

State Museum | వైఎస్సార్ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం

Ritika Nayak | కథ నచ్చితేనే ఓకే.. రితికా నాయక్ ప్లాన్ ఇదే



