త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manchireddy Kishan Reddy | రేవంత్‌! రైతుల‌ను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్త‌వ్‌?

Manchireddy Kishan Reddy | భూసేక‌ర‌ణ పేరిట రైతుల‌ను ఇబ్బంది పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి ఏం సాధిస్తార‌ని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Oct 13, 2026, 2.42 pm IST

Manchireddy Kishan Reddy | రేవంత్‌! రైతుల‌ను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్త‌వ్‌?
Advertisement
  • మా నియోజకవర్గంలో 60 వేల కోట్ల విలువైన భూములను తాకట్టు పెట్టారు
  • 10 వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేయించుకున్నరు
  • మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Manchireddy Kishan Reddy | త్రినేత్ర న్యూస్: భూసేక‌ర‌ణ పేరిట రైతుల‌ను ఇబ్బంది పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి ఏం సాధిస్తార‌ని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. మా నియోజ‌క‌వ‌ర్గంలో రూ.60 వేల కోట్ల విలువైన భూముల‌ను తాక‌ట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రూపాయ‌ల రుణం మంజూరు చేయించుకున్నార‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

భూ సేకరణకే రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారు. వేరే విషయాలు పట్టించుకోవడం లేదు. ఫార్మా సీటీ అంటేనే రైతులు నాడు కేసీఆర్ హయాంలో 14 వేల ఎకరాల భూమి ఇచ్చారు. ఐదేళ్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయకపోతే రైతులకు ఫార్మా సిటీ భూములు తిరిగి ఇవ్వాలని నాటి గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 14 వేల ఎకరాల ఫార్మా సిటీని రద్దు చేసి మరో 2,500 ఎకరాలు ఆ పక్కనే సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంతా గోప్యంగా చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగడం లేదు.

6 వేల కోట్లు జ‌మైన‌య్‌

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరు మీద ఇబ్రహీంపట్నంలో రెండు గ్రామాల్లో మొత్తం భూమిని గుంజుకుంటున్నారు. మా నియోజకవర్గంలో 60 వేల కోట్ల విలువైన భూములను తాకట్టు పెట్టి కేవలం పది వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేయించుకున్నారు. ఇప్పటికే 6 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. 22ఏ జాబితాలో భూములు పెట్టి 50 శాతం కమీషన్ ఇస్తే క్లియర్ చేస్తామని కాంగ్రెస్ బ్రోకర్లు తిరుగుతున్నారు. ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురిచేసి రేవంత్ రెడ్డి ఏం సాధిస్తారు? రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో విచ్చలవిడిగా జరుపుతున్న భూ సేకరణ కు ఉద్దేశం ఏమిటో తెలియడం లేదు. భూ దండాలు, అరాచకాలకు సీఎం వెంటనే తెర దించాలి అని కిష‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు.

వెంక‌ట‌య్య నే రైతు పొలానికి క‌రెంటు క‌ట్ చేశారు: పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసమే ఇబ్బడిముబ్బడిగా భూ సేకరణ చేస్తున్నారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు.. ఎక్కడ కంపెనీలు వచ్చాయి, ఒక్కటైనా ఉద్యోగం ఇచ్చారా? అన్ని పేపర్ మీద ఉన్న‌య్‌ తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరగడం లేదు. కొడంగల్‌లో వెంకటయ్య అనే రైతు భూమి ఇవ్వకుంటే ఆయన పొలానికి కరెంటు కట్ చేశారు.

సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే రైతుల పరిస్థితి అట్లా ఉంటే మిగతా తెలంగాణలో పరిస్థితి చెప్పనక్కర్లేదు. తెలంగాణలో కరువు రేవంత్ తెచ్చిందే. ఇక్కడ రైతులు అల్లాడుతుంటే సీఎం ఢిల్లీ, గోవా అంటూ విహార యాత్రలు చేస్తున్నారు. రెండు మూడు నెలలు ఆగితే రైతులు మంత్రులకు తిరగలేని పరిస్థితి సృష్టిస్తారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయమని బీఆర్ఎస్ నేతలు సూచించిన నాడే ఎత్తిపోసి ఉంటే రాష్ట్రంలో ఈ కరువు ఉండేదా? తాగడానికి నీళ్లు లేని పరిస్థితి తెచ్చారు. పాత రోజులు తెస్తామని కష్టాలు తెచ్చారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలుకాకముందే ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి.

పీవీ విగ్ర‌హం ఎందుకు తీసేశారు: సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ

కేబీఆర్ పార్కు దగ్గర రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలు అస్తవ్యస్త పాలనకు అద్దం పడుతున్నాయి. కేబీఆర్ పార్కు దగ్గర ఉన్న మాజీ పీఎం పీవీ నరసింహరావు విగ్రహాన్ని ఎందుకు తొలగించారు? కనీస సమాచారం లేకుండా భూ సేకరణ చేయడం సరికాదు. విచ్చలవిడిగా భూ సేకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం సరికాదు.

Advertisement
Advertisement