త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Nellikanti Satyam | విద్యుత్ ఆర్టిజ‌న్ల డిమాండ్లు ప‌రిష్క‌రించండి: సీఎంకు నెల్లికంటి సత్యం లేఖ‌

MLC Nellikanti Satyam | విద్యుత్ ఆర్టిజన్ (Artisans) కార్మికుల డిమాండ్లు (Demands) న్యాయమైనవని.. తక్షణమే వాటిని పరిష్కరించాల‌ని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Satyam) డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్ల సాధ‌న కోసం ఈనెల 8 నుంచి నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగిన ఆర్టిజ‌న్ కార్మికుల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

S

News | Published On Apr 13, 2026, 3.35 pm IST

MLC Nellikanti Satyam | విద్యుత్ ఆర్టిజ‌న్ల డిమాండ్లు ప‌రిష్క‌రించండి: సీఎంకు నెల్లికంటి సత్యం లేఖ‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: విద్యుత్ ఆర్టిజన్ (Artisans) కార్మికుల డిమాండ్లు (Demands) న్యాయమైనవని.. తక్షణమే వాటిని పరిష్కరించాల‌ని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Satyam) డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్ల సాధ‌న కోసం ఈనెల 8 నుంచి నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగిన ఆర్టిజ‌న్ కార్మికుల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కోరుతూ ఆయ‌న సీఎం రేవంత్‌కు బ‌హిరంగ లేఖ (letter) రాశారు.

2017లో గత ప్రభుత్వం కార్మికులను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తామని హామీ ఇచ్చింద‌న్నారు. ప్రమోషన్లు, సెలవులు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. సంస్థలోని రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే 'APSEB రూల్స్' కాకుండా ఆర్టిజన్ల కోసం ప్రత్యేకంగా 2020లో కొత్త సర్వీసు రూల్స్ తెచ్చి వారిపై రుద్దడం అన్యాయమ‌ని చెప్పారు. తాగునీరు, లైటింగ్ వంటి కనీస సదుపాయాలు కూడా క‌ల్పించ‌డం లేద‌న్నారు. సబ్ స్టేషన్లలో తీవ్రమైన సిబ్బంది కొరత ఉంద‌ని పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం స‌రికాద‌న్నారు.

రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో (TGTRANSCO, TGGENCO, TGSPDCL, TGNPDCL) గత 25-30 సంవత్సరాలుగా కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నార‌ని వివ‌రించారు. అయినప్ప‌టికీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంద‌ని చెప్పారు. ఈ మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిరవధిక సమ్మెకు దిగిన ఆర్టిజన్ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న‌ట్లు ఆ లేఖ‌లో తెలిపారు.

నిరవధిక సమ్మె కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం త‌లెత్తే ప‌రిస్థితి ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి వారి ప్రధాన డిమాండ్లను పరిష్కరించాల‌ని కోరారు. 20 వేల కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న‌ట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇవీ డిమాండ్లు...

  • విద్యార్హతను బట్టి ఆర్టిజన్ కార్మికులందరికీ (జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్) కన్వర్షన్ చేయాలి
  • సంస్థలో పనిచేస్తున్నవారికి వివక్ష లేకుండా 'APSEB రూల్స్' అమలు చేయాలి
  • TGSPDCL తరహాలోనే TGNPDCL పరిధిలోని Un-Manned వర్కర్స్ ను, 2016 నుంచి పక్కన పెట్టిన కార్మికులను సంస్థలోకి తీసుకోవాలి
  • పీస్ రేట్ వర్కర్స్ (బిల్ రీడర్స్, బిల్ కలెక్టర్స్, హమాలీ తదితర) అందరికీ కనీస వేతన చట్టం అమలు చేయాలి
  • కార్మికులందరికీ ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఇచ్చే 'PRC-2026' ను అమలు చేయాలి.
Advertisement
Advertisement