త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balka Suman | బడే భాయ్, చోటే భాయ్, మిడిల్ భాయ్ కలిసి సింగరేణిని ముంచుతున్నరు

Balka Suman | బ‌డే భాయ్‌, బడే భాయ్, చోటే భాయ్, మిడిల్ భాయ్ కిష‌న్‌రెడ్డి కలిసి సింగరేణిని ముంచుతున్నార‌ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఆరోపించారు. గనుల వేలానికి సంబంధించిన ఎంఎండీఆర్ బిల్లును తాను ఎంపీగా వ్యతిరేకించాన‌ని గుర్తు చేశారు. ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్‌లను నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jul 9, 2026, 1.27 pm IST

Balka Suman | బడే భాయ్, చోటే భాయ్, మిడిల్ భాయ్ కలిసి సింగరేణిని ముంచుతున్నరు
Advertisement
  • ఇప్ప‌టి వ‌ర‌కు రూ.16 వేల కోట్ల కుంభకోణాలు జరిగాయ్‌
  • పిల్ల‌ర్లు కుంగితే ఎన్‌డీఎస్ఏను పంపారు.. మ‌రి సింగ‌రేణి స్కాంలు జ‌రిగితే సీబీఐ ఎందుకొస్త‌లే?
  • నేను ఎంపీగా ఉన్న‌ప్పుడు ఎంఎండీఆర్ బిల్లును వ్య‌తిరేకించా.. లోక్‌స‌భ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది
  • ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్‌లను నామినేషన్ పద్ధతిలోనే సింగరేణికి కేటాయించాలి
  • మీడియా స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ డిమాండ్‌

త్రినేత్ర‌.న్యూస్‌: బ‌డే భాయ్‌, బడే భాయ్, చోటే భాయ్, మిడిల్ భాయ్ కిష‌న్‌రెడ్డి కలిసి సింగరేణిని ముంచుతున్నార‌ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఆరోపించారు. గనుల వేలానికి సంబంధించిన ఎంఎండీఆర్ బిల్లును తాను ఎంపీగా వ్యతిరేకించాన‌ని గుర్తు చేశారు. ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్‌లను నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2ను సాధించామని బీజేపీ, కాంగ్రెస్‌లు గొప్పలు చెప్పుకుంటున్నాయ‌ని విమర్శించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద NDSAను పంపారని.. మ‌రి సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై సీబీఐ (CBI) ఎందుకు రావడం లేదని ప్ర‌శ్నించారు. గురువారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ జాతీయ పార్టీల‌పై నిప్పులు చెరిగారు.

కేసీఆర్ సిరుల గ‌నిగా మార్చిండు..

సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం. కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణిని లాభాల బాట పట్టించాం. కేసీఆర్ ఉన్న‌ప్పుడు కారుణ్య నియామకాలు చేప‌ట్టారు. జీవో 76 కింద వేలాది కుటుంబాలకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. థ‌ర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేసీఆర్ కృషి ఉంది. ఎంఎండీఆర్‌ చట్టానికి వ్యతిరేకంగా లోక్‌సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సింగరేణిని వేలం పాట పెడితే నష్టపోతుందని ఆనాడే రాజ్యసభలో మా పార్టీ తరపున కేశవరావు మాట్లాడిండు. సింగరేణి బొగ్గు బావులను వేలం వేయొద్దని ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణినీ సిరుల గనిగా ఉంచారు అని సుమ‌న్ వివ‌రించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి కుంభకోణాలకు అడ్డాగా మారిపోయింది. సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఓబీ (OB) టెండర్‌లో కుంభకోణం చేశారు. 42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు 16 వందల కోట్ల రూపాయల కుంభకోణం. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో సింగరేణిలో మొత్తం 16 వేల కోట్ల కుంభ కోణాలు జరిగాయి అని బాల్క సుమ‌న్ ఆరోపించారు.

డీజిల్ కుంభ‌కోణానికి తెర లేపిండ్రు..

మా నాయకుడు హరీశ్‌రావు బొగ్గు నిల్వలు చూసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ వచ్చిన తరువాత సింగరేణిలో డీజిల్ కుంభకోణానికి తెర లేపారు. పంపకాల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంచాయతీ. ఆ తర్వాత నైని బొగ్గు బ్లాక్ టెండర్‌ను రద్దు చేశారు. బడే భాయ్, చోటే భాయ్ మధ్యలో మిడిల్ భాయ్ కిషన్ రెడ్డి కలిసి సింగరేణిని నాశ‌నం చేస్తున్న‌రు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2ను సాధించామని బీజేపీ, కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్నాయి అని ఆయ‌న విమ‌ర్శించారు.

సీఎం బావ‌మ‌రిది అక్ర‌మాలకు పాల్ప‌డుతున్న‌డు..

ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి సింగరేణిలో వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు.
ఆధారాలతో సహ మా నాయకుడు హరీశ్‌రావు సింగరేణి కుంభకోణం బయటపెడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి భాయ్ భాయ్.. అందుకే సింగరేణిలో కుంభకోణాలకు పాల్పడుతున్నారు.
సింగరేణిలో జరుగుతున్న అవినీతి కిషన్ రెడ్డికి ఎందుకు కనిపించడం లేదు. అన్ని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పగించాలి. నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలి అని బాల్క సుమ‌న్ డిమాండ్ చేశారు.

స‌త్తుప‌ల్లి బ్లాక్ కేసుపై ప్ర‌భుత్వం ఎందుకు కొట్లాడ‌ట్లే: మిర్యాల రాజిరెడ్డి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు

బొగ్గు గనుల వేలం పాట వేయాలని తీసుకున్న నిర్ణయానికి బీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. 1995లో గుర్తించిన తాడిచర్ల బొగ్గు బ్లాక్ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్లే సింగరేణికి వచ్చింది. ప్రపంచంలో అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం. వినియోగించుకునే విషయంలో కోల్ ఇండియా కంటే సింగరేణి ముందంజలో ఉంది. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని బ్లాక్‌లు సింగరేణికే కేటాయించాలి. సింగరేణి పరిధిలో బ్లాక్‌లకు ఫారెస్ట్ అనుమతులు వచ్చేలా కిషన్ రెడ్డి ప్రయత్నం చేయాలి. సత్తుపల్లి బ్లాక్ కేసుపై ప్ర‌భుత్వం కొట్లాడలేని స్థితిలో ఉందా? మణుగూరులో ఓపెన్ కాస్ట్ సింగరేణి ఒకటే టెండర్ వచ్చింది. జెన్‌కోతో టెండర్ ఎందుకు వేయించారో సమాధానం చెప్పాలి.

ఈ మీడియా స‌మావేశంలో టీజీబీకేఎస్ నేతలు కృష్ణ, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement