Revanth Reddy | మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంపై చర్చ
Revanth Reddy | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో (Devendra Fadnavis) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సీఎంల సమావేశం జరుగుతున్నది.
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో (Devendra Fadnavis) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సీఎంల సమావేశం జరుగుతున్నది. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి (Tummidihatti Barrage) వద్ద ఆనకట్ట నిర్మాణం అంశంపై చర్చిస్తున్నారు. ప్రస్తుత ఒప్పందంలో ఉన్న ఆనకట్ట ఎత్తు 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచే ప్రతిపాదనకు అంగీకారం తెలపాలని సీఎం రేవంత్ కోరనున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం ఆవశ్యకత, రాష్ట్ర అవసరాలు, కలిగే ప్రయోజనాలు, తదితరాలను వివరించనున్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు, అధ్యయనాలు, నివేదికలను మహారాష్ట్ర సీఎంకు అందించనున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్, సీఎస్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు.
పదేండ్ల క్రితమే ఒప్పందం.. ఇప్పటికీ ప్రారంభంకాని పనులు..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో (Pranahitha Chevella Project) భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి 2016 ఆగస్టు 23న అప్పటి ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేయాల్సి ఉండగా, ఆ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయితే 148 మీటర్ల ఎత్తుతో గ్రావిటీ ద్వారా ఆశించిన స్థాయిలో నీటిని తరలించడం సాధ్యంకాదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో 152 మీటర్లకు పెంచితే గ్రావిటీ ద్వారా ఎక్కువ నీటిని తరలించడంతో పాటు విద్యుత్ వ్యయాన్ని తగ్గించవచ్చని చెబుతున్నది. దీంతో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అంగీకారం సాధించడంపై ప్రస్తుతం దృష్టి సారించింది.
ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి వీలుగా సహకారం అందించాలని ప్రధాని మోదీతో పాటు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌లను సీఎం రేవంత్ పలుమార్లు నేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదే విషయమై పలు లేఖలు రాశారు. ఇటీవలే ప్రధాని కార్యాలయం సీఎం విజ్ఞప్తికి స్పందించి కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సమావేశం కూడా నిర్వహించింది. కాగా, 152 మీటర్ల ఎత్తుతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా మహారాష్ట్ర గట్టి పట్టు పడితే 150 మీటర్లతో అయినా సమ్మతి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
- ●HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
- ●Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు
- ●Mutual Funds | మిడ్‌క్యాప్ షేర్లతో అధిక రాబడులు.. ప్రభుత్వ బాండ్లతో స్థిరత్వం..
- ●Ayodhya Ram Mandir | భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..

HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు






