Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు అధిక స్థాయిల్లో ఉండడం వంటి పలు కారణాల వల్ల ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. అయితే ఈ వారం సూచీలు నష్టాలతో మొదలుపెట్టినప్పటికీ తరువాత లాభాల్లోకి చేరాయి. ఇక బులియన్ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు అధిక స్థాయిల్లో ఉండడం వంటి పలు కారణాల వల్ల ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. అయితే ఈ వారం సూచీలు నష్టాలతో మొదలుపెట్టినప్పటికీ తరువాత లాభాల్లోకి చేరాయి. ఇక బులియన్ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర సోమవారం 0.21 శాతం పెరిగి 4,005 డాలర్లకు చేరగా, వెండి ధర 0.10 శాతం పెరిగి 53 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 482 పాయింట్లు పెరిగి 1,42,506 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 140 పాయింట్లు తగ్గి 1,95,579 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,275 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,200 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,750 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,27,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,085 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,04,680గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,30,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,08,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,706 ఉండగా, 8 గ్రాముల ధర రూ.85,648గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,060 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,70,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,20,000 ఉండగా, తులం ధర రూ.2,200గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,20,000 ఉండగా, తులం ధర రూ.2,200 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తగ్గని అస్థిరత.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
అక్టోబర్ 24, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. మళ్లీ మొదలైన టెన్షన్..?
అక్టోబర్ 22, 2026

Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
అక్టోబర్ 21, 2026
తాజావార్తలు
- ●HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
- ●Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు
- ●Mutual Funds | మిడ్‌క్యాప్ షేర్లతో అధిక రాబడులు.. ప్రభుత్వ బాండ్లతో స్థిరత్వం..
- ●Ayodhya Ram Mandir | భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!
- ●Farmhouse | పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతి

HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు

Mutual Funds | మిడ్‌క్యాప్ షేర్లతో అధిక రాబడులు.. ప్రభుత్వ బాండ్లతో స్థిరత్వం..



