Jagadeesh Reddy | ఎవన్ని గుంజకు కట్టేయాల్నో.. కోదండం ఎక్కియాల్నో ప్రజలే చెప్తరు
Jagadeesh Reddy | అప్పుడు వద్దన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటే (Yaadadri Thermal Power Plant) ఇప్పుడు దిక్కయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) అన్నారు.
- నువ్వు నేను ఒక్కటే కార్ల పోదాం దా.. ఎవల్ని కట్టేస్తరో సూద్దాం
- అప్పుడు యాదాద్రి వద్దంటే ఇప్పుడు అదే దిక్కయింది
- రూ.15 పెట్టినా కరెంటు దొర్కుతలేదని లంగ మాటలు చెప్తున్నరు
- కరెంటు రేటు రూ.6.74 కంటే ఎక్కువ ఏడా లేదు
- ఐఈఎక్స్ యాప్‌లో వెళ్లి వెతికితే నిజాలు తెలుస్తయ్
- కరెంటు కష్టాలు తెచ్చినందుకు చెంపలేసుకో ఇగ
- సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
Jagadeesh Reddy | త్రినేత్ర న్యూస్: అప్పుడు వద్దన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటే (Yaadadri Thermal Power Plant) ఇప్పుడు దిక్కయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) అన్నారు. రూ.15 పెట్టినా కరెంటు దొరుకతలేదని సీఎం రేవంత్ లంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రూ.6.74 కు మించి కరెంటు రేటు లేదన్నారు. ఐఈఎక్స్ యాప్‌లో వెతికితే నిజాలు తెలుస్తాయని హితవు పలికారు. ఈ వాస్తవాలు తెలిసిన ప్రజలే ఎవల్ని గుంజకు కట్టేయాల్నో, ఎవన్ని కోదండం ఎక్కియాల్నో నిర్ణయిస్తారన్నారు. కేసీఆర్ నిర్మించిన కరెంటు వ్యవస్థను అలాగే నడిపితే ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా విద్యుత్ ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరెంటు కష్టాలు తెచ్చిన రేవంత్ చెంపలేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల ద్రుష్టిని మళ్లించే రాజకీయాలు చేస్తోంది. ఎల్‌నినో వల్ల కరువు వస్తుందని తొమ్మిది నెలల ముందు నుంచి తెలుసు. చాలా దేశాలు ఎల్ నినో నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి. ఇటలీ లాంటి దేశాల్లో ప్రజలకు ఏ పంటలు వేయాలో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. తెలంగాణలో మాత్రం దొంగలు పడ్డ ఆరు నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ప్రభుత్వ వ్యవహారం ఉంది. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను తిట్టడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు.
ఇంటివాళ్లు నవ్వుకుంటారన్న సోయీ లేదు..
ఎల్ నినోకు బీఆర్ఎస్ కారణం అని మంత్రులు చవకబారు మాటలు మాట్లాడుతున్నారు. తమ మాటలకు ఇంటి వాళ్లు కూడా నవ్వుకుంటారనే సోయి కూడా మంత్రులకు లేదు. సీఎం అన్నాడని మంత్రులు పోటీ పడి ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ ను తిడుతున్నారు. రేవంత్ పాలనలో ఒక్క కిలో వాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి జరగలేదు. కరోనా సమయంలో ఎంత డిమాండ్ అయినా తట్టుకుని నిమిషం పాటు కూడా కరెంటు పోనివ్వకుండా చూసిన ఘనత కేసీఆర్‌ది.
1.80 పైసలకు కూడా దొరుకుతది
కరెంటు విషయంలో కమీషన్లు రావనే కాంగ్రెస్ సంక్షోభం తెచ్చింది. మార్కెట్లో కరెంటు అందుబాటు ధరలపై సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు. 15 రూపాయలు పెట్టినా కరెంటు దొరకడం లేదట. 6 .74 రూపాయలకు మించి కరెంటు రేటు లేదు. రూ.1.80 పైసలకు కూడా కరెంటు దొరుకుతోంది. కేసీఆర్ కరెంటు ఎక్కువ ధర పెట్టి కొన్నారు అని గతంలో అన్నవారు ఇపుడు ఎక్కువ ధరకు పెట్టి ఎందుకు కొంటున్నారు?
యాదాద్రి పవర్ ప్లాంట్ ను బంద్ చేసే దమ్ముందా? బొగ్గు లేని ప్రాంతంలో యాదాద్రిని కట్టారు అంటున్నవారు బొగ్గు లేని విజయవాడ, కడపలో ఎందుకు కట్టారో చెప్పగలరా? సింగరేణి నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ 250 కిలోమీటర్ల దూరంలో కూడా లేదు. విజయవాడకు సింగరేణికి దూరం 530 కిలోమీటర్ల పైనే. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి విజయవాడ దూరం 1200 కిలోమీటర్ల పైనే. కడపకు మహానది కోల్ ఫీల్డ్స్ దూరం 1500 కిలోమీటర్ల పైనే ఉంది. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపేందుకే యాదాద్రిలో దూరదృష్టితో కేసీఆర్ పవర్ ప్లాంట్ కట్టారు.
డీఆర్డీవో,హెచ్ఎంటీలను హైదరాబాద్ లో ఎందుకు కట్టారు? ఢిల్లీలో కడితే సరిపోయేది కదా. కాంగ్రెస్ లోభితనంతోనే విద్యుత్ సమస్య వచ్చింది.
ఉత్తమ్! నీళ్లెట్లొస్తయో చెప్త దా
కన్నెపల్లి పంప్ హౌస్‌కు వెళదాం.. నేను చెప్పిన పద్ధతిలో పంపులు ఆన్ చేయండి. నీళ్లు ఎట్లా రావో నేను చూస్తా. మా ఎమ్మెల్యేలు ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ వెళ్లారు. ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోయవచ్చని వారు ప్రజలకు వివరించారు. సీఎం తన సొంత జిల్లా ప్రయోజనాలు పక్కన బెట్టి చంద్రబాబుకు 700 కిలోమీటర్ల దూరం కృష్ణా జలాలను తీసుకుపోయే అవకాశం ఇచ్చారు. ఉత్తమ్ ఉత్తర కుమారుడిలా వ్యవహరించి నల్లగొండను ఎండబెట్టారు. రేవంత్, ఉత్తమ్ ఇద్దరు కలిసి తెలంగాణ సాగు నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. మీకు చేతకాకపోతే నీళ్లు ఎలా ఎత్తిపోయవచ్చో మేం చెబుతాం. ప్రజలు కాంగ్రెస్ కుట్రలు గమనించాలి. తుమ్మిడిహట్టిపై మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు. ఇప్పుడు తుమ్మిడిహట్టిపై ఏం చేస్తారో చూద్దాం.
నిన్నే కట్టేస్తరు
యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గర కేసీఆర్, జగదీశ్ రెడ్డిని కట్టేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి! నువ్వూ నేను ఒకే కార్లో వెళదాం. కొడంగల్ వెళదామా, ఇంకెక్కడికైనా వెళదామా? నువ్వు తెలంగాణకు చేసిన ద్రోహానికి నిన్నే ప్రజలు కట్టేస్తారు. కాంగ్రెస్ వల్లనే కరువు వచ్చింది అనేది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ నేతలకు మూటలు సర్దుకోవడంలో ఉన్న ధ్యాస ఎల్ నినో సమస్యల పరిష్కారంలో లేదు. సోయి లేని, బాధ్యత లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం, మంత్రులు ఒక్కరైనా ప్రజలకు ధైర్యాన్ని, ఊరటనిచ్చే మాటలు చెప్పారా? ప్రజలకు కావాల్సింది బూతులు కాదు.. భరోసా కావాలి. మూడేళ్ల నుంచి చెప్పిన మాటలే చెబుతున్నారు.. ప్రజలకు ఊరటనిచ్చే పని ఒక్కటీ చేయలే.
విదేశాల బొగ్గు వద్దని ఆనాడే చెప్పినం
పవర్ ప్లాంట్ ఎక్కడ కట్టినా బొగ్గు కేటాయించేది కేంద్ర ప్రభుత్వమే అనే సంగతి కాంగ్రెస్ అజ్ఞానులకు తెలియదు. కరెంటు మనది మనకు ఉండాలని కేసీఆర్ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టారు. బుద్ది, జ్ఞానం లేకనే రేవంత్ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలన్న కేంద్ర నిర్ణయాన్ని కేసీఆర్ ఆనాడే వ్యతిరేకించారు. మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ ఆనాడు కరెంటు ఉత్పత్తిని ప్రైవేటుకు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి తన చీకటి దోస్తుల ప్రయోజనాల కోసం విదేశీ బొగ్గుపై ఆసక్తి చూపుతున్నారు. కరెంటు కష్టాలు తెచ్చినందుకు సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చెంపలు వేసుకోవాలి అని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ ప్రెస్ మీట్‌లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నరసింహ రెడ్డి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | చిక్కులు లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
అక్టోబర్ 24, 2026

Khulsumpura Traffic Police Special Drive | సెల్‌ఫోన్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్‌లో దొరికిపోయారు.. ఎన్ని కేసులయ్యాయంటే!
అక్టోబర్ 24, 2026

Uttam Kumar Reddy | ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఈ కరువు దెబ్బ తగ్గేది
అక్టోబర్ 24, 2026
తాజావార్తలు
- ●Harish Rao | నిరుద్యోగులను అరెస్టు చేయడం సిగ్గుచేటు : హరీశ్‌రావు
- ●Vijay Deverakonda | కొత్త ఏడాదిలో సెట్స్‌పైకి విజయ్ దేవరకొండ మైథాలజీ మూవీ - కన్నడ నాయికతో రొమాన్స్
- ●TGPCB | దసరా సెలవుల్లో.. హైదరాబాద్‌లో మెరుగుపడ్డ గాలి నాణ్యత
- ●Ponguleti Srinivas Reddy | చిక్కులు లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
- ●Minister Seethakka | మహిళా జర్నలిస్టులపై దాడులు సరికావు : మంత్రి సీతక్క
- ●Gopichand | జెట్ స్పీడ్‌లో గోపీచంద్ "సింగ" షూటింగ్ - హీరోయిన్గా మలయాళ బ్యూటీ

Harish Rao | నిరుద్యోగులను అరెస్టు చేయడం సిగ్గుచేటు : హరీశ్‌రావు

Vijay Deverakonda | కొత్త ఏడాదిలో సెట్స్‌పైకి విజయ్ దేవరకొండ మైథాలజీ మూవీ - కన్నడ నాయికతో రొమాన్స్

TGPCB | దసరా సెలవుల్లో.. హైదరాబాద్‌లో మెరుగుపడ్డ గాలి నాణ్యత

Ponguleti Srinivas Reddy | చిక్కులు లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు




