Ayodhya Ram Mandir | భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!
Ayodhya Ram Mandir | అయోధ్యలో గల శ్రీరామ జన్మభూమి మందిరంలో (Ayodhya Ram Mandir) బాలరాముడి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. శీతాకాలం నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుంచి ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. రాత్రి 10 గంటల వరకూ స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
Ayodhya Ram Mandir | త్రినేత్ర న్యూస్ : భక్తులకు కీలక అలర్ట్. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల శ్రీరామ జన్మభూమి మందిరంలో (Ayodhya Ram Mandir) బాలరాముడి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సీజన్ మారిన (శీతాకాలం) నేపథ్యంలో దర్శన వేళల్లో మార్పులు చేస్తూ ఆలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించింది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు రామ మందిరాన్ని ఉదయం 3:45 గంటలకే తెరిచేవారు. రాత్రి 10:30 వరకూ భక్తులకు బాలరాముడి (Ram Lalla) దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే, శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. రాత్రి 10 గంటల వరకూ స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. 4 గంటలకు ఆలయ తలుపులు తెరవనున్నారు. 4:30 - 4:40 మధ్య మంగళ హారతి ఉంటుంది. 4:40 నుంచి 6:30 వరకూ అభిషేకం, ధూప దీప నైవేద్యం తదితర పూజా కార్యక్రమాల నేపపథ్యంలో భక్తులకు ప్రవేశం ఉండదు. 6:30కి శృంగార హారతి తర్వాత భక్తులకు బాలరాముడి దర్శనానికి అనుమతిస్తారు.
మళ్లీ ఉదయం 8 గంటల నుంచి 10 నిమిషాల (8:10) వరకూ బాల్ భోగ్ కోసం దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆ తర్వాత 11:30 గంటల వరకూ భక్తులకు నిరంతరం బాలరాముడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. 11:30 నుంచి 12 గంటల వరకూ రాజ్ భోగ్ సమర్పణ ఉంటుంది. ఇందుకోసం భక్తుల దర్శనాలను నిలిపివేస్తారు. 1:30 గంటల వరకూ రామ్‌లల్లాకు విశ్రాంతి సమయం. మళ్లీ 1:35 తర్వాత భక్తులకు దర్శనాలు పునఃప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటలకు బాల్ భోగ్ కోసం మళ్లీ ఆలయాన్ని పది నిమిషాలు అంటే 4:10 వరకూ మూసివేస్తారు. ఆ తర్వాత 6:45 వరకూ భక్తులకు దర్శనాలు కొనసాగుతాయి.
ఆ తర్వాత పూజా కార్యక్రమాల నిమిత్తం 7 గంటల వరకూ దర్శనాలను నిలిపివేయనున్నారు. సంధ్యాహారతి తర్వాత మళ్లీ భక్తులకు అనుమతి ఉంటుంది. రాత్రి 9:30 గంటలకు శయన హారతి నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు ఆలయ తలుపులను పూర్తిగా మూసివేస్తారు. ఈ షెడ్యూల్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. రామ్‌లల్లా దర్శనానికి వెళ్లే భక్తులు షెడ్యూల్‌ను చూసుకుని వెళ్లడం మంచిది. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జారీ చేసే పాసుల సంఖ్యను రెట్టింపు చేసినట్లు రామమందిర కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్ దాస్ వెల్లడించారు.
Also Read..
పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు మృతి
అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Farmhouse | పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతి
- ●Rain Update | అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
- ●Stock Markets | ముడిచమురు ధరల సెగ.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Building Collapse | ఢిల్లీలో కుప్పకూలిన మరో భవనం.. ఇద్దరు మృతి
- ●Lula da Silva | బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి.. మరోసారి అధికారంలోకి లూలా డా సిల్వా
- ●RTC Conductor | చిల్లర కోసం గొడవ.. కండక్టర్‌ను బస్సులోనుంచి తోసేసిన మహిళ

Farmhouse | పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతి

Rain Update | అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Stock Markets | ముడిచమురు ధరల సెగ.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Building Collapse | ఢిల్లీలో కుప్పకూలిన మరో భవనం.. ఇద్దరు మృతి





