Harish Rao | అవినీతికి కేంద్రంగా మారిన విద్యా సంస్థలు.. రేవంత్ రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనం: హరీశ్ రావు
Harish Rao | పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో వరుస పరీక్షా పత్రాల లీక్‌లు విద్యార్థుల భవిష్యత్తును బలిచేస్తున్నాయన్నారు.
trinethra.news : పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో వరుస పరీక్షా పత్రాల లీక్‌లు విద్యార్థుల భవిష్యత్తును బలిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంలో విఫలమైన రేవంత్ రెడ్డి సర్కార్, పరీక్షలను నిర్వహణలోనూ ఫెయిల్ అయిందని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేండ్లలోనే కుంభకోణాలకు చిరునామాగా మారడం దురదృష్టకరమన్నారు. చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి రేవంత్ రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనమని మండిపడ్డారు.
'ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్షా పత్రాల లీక్ ఘటన, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగాని తనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చేస్తోంది. మొన్నటి పీజీ వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కాం ఇంకా మరువకముందే, ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, AI పెన్‌లతో రాసిన మోడరన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఇంత బహిరంగంగా, అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రలో మునిగి ఉంది?. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారడం దురదృష్టకరం. చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి, రేవంతు రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనం.
మహాకవి శ్రీశ్రీ గారు "కాదేదీ కవితకు అనర్హం" అని చెప్పారు... కానీ రేవంత్ రెడ్డి "కాదేదీ స్కాంకు అనర్హం" అని చెప్పడమే కాకుండా, చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాదు, పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతకాదు..ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యం. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం` అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు

Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
ఆగస్టు 10, 2026

AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
ఆగస్టు 10, 2026

Harish Rao | నిరుపేదలను డాక్టర్లను చేసే బాధ్యత నాదే.. పట్టుదలతో చదివి గొప్ప ఆఫీసర్లుగా ఎదగండి
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి
- ●Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..
- ●Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
- ●AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
- ●Horoscope | ఆగస్టు 10 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని మార్పులు ఉండవచ్చు!
- ●Free Online Education | ఆన్లైన్లో చదువు ఉచితం.. అయినా లక్షల ఫీజులు ఎందుకు కడుతున్నారు? భవిష్యత్తులో స్కూళ్లు ఉంటాయా?

Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి

Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..

Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్



