త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన సీఎం రేవంత్‌

Revanth Reddy | రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో అర్ధ‌రాత్రి భారీ వాన (Heavy Rain) బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. రాబోయే రెండు, మూడు గంట‌ల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ  (IMD) హెచ్చ‌రించింది.

G

Telangana | Published On May 27, 2026, 11.38 am IST

Revanth Reddy | ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో అర్ధ‌రాత్రి భారీ వాన (Heavy Rain) బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. రాబోయే రెండు, మూడు గంట‌ల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ  (IMD) హెచ్చ‌రించింది. ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఈ నేపథ్యంలో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్త‌యిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

కాగా, రాబోయే రెండు, మూడు గంట‌ల్లో నారాయ‌ణ‌పేట‌, రంగారెడ్డి, వికారాబాద్‌, వ‌న‌ప‌ర్తి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, హైద‌రాబాద్‌, గ‌ద్వాల‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మెద‌క్‌, మ‌ల్కాజిగిరి, నాగ‌ర్‌క‌ర్నూల్‌, న‌ల్ల‌గొండ‌, సంగారెడ్డి, సూర్యాపేట‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, భువ‌న‌గిరి జిల్లాల్లో ఈదురుగాలుల‌తో కూడిన‌ తేల‌క‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Advertisement
Advertisement