Wanaparthy | అప్పు ఇచ్చినవారు వేధిస్తున్నారని.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య
Wanaparthy | త్రినేత్ర.న్యూస్: వనపర్తి (Wanaparthy) జిల్లా ఖిల్లా ఘనపుపురంలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు ఇచ్చిన వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని భార్య, ఇద్దరు పిల్లలను చంపిన వ్యక్తి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
Wanaparthy | త్రినేత్ర.న్యూస్: వనపర్తి (Wanaparthy) జిల్లా ఖిల్లా ఘనపుపురంలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు ఇచ్చిన వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని భార్య, ఇద్దరు పిల్లలను చంపిన వ్యక్తి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖల్లా ఘనపురం మండలం సల్కలాపురం గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున దారుణానికి పాల్పడ్డాడు. పది, ఎనిమిదో తరగతి చదువుతున్న తన కుమారుడు సాయి నిహాల్, కుమార్తె సాయిశ్రీని ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేసి చంపేశాడు. ఆ తర్వాత భార్య హేమలతకు ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తానూ సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
అప్పుల బాధలు భరించలేకే..
హోమ్‌లోన్ బాధలు భరించలేకేనని సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పు ఇచ్చినవారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అప్పు ఉన్నానని గోడపై రాయించి ఇంటిని సీజ్ చేశారని, ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్లారని నరసింహ వీడియోలో పేర్కొన్నాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో సల్కలాపురం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MP Kadiyam Kavya | వరంగల్‌లో పెండింగ్ రహదారులకు ఆమోదం తెలపండి
- ●Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు
- ●Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంటవ్ రేవంత్?
- ●Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..
- ●Kajal Aggarwal | కాజల్‌కు అచ్చిరాని బాలీవుడ్ - చందమామ ఖాతాలో మరో డిజాస్టర్
- ●Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..

MP Kadiyam Kavya | వరంగల్‌లో పెండింగ్ రహదారులకు ఆమోదం తెలపండి

Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు

Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంటవ్ రేవంత్?

Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..





