BRO Recruitment | బీఆర్‌వోలో జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్.. 899 పోస్టులతో నోటిఫికేషన్
BRO Recruitment | సాయుధ దళాల వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ (GREF) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టింది.
BRO Recruitment | త్రినేత్ర.న్యూస్: సాయుధ దళాల వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ (GREF) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 899 పోస్టులతో నోటిఫికేషన్ (BRO Recruitment) విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూలై 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన పురుష అభ్యర్థులు దీనికి అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 899
పోస్టుల వారీగా వివరాలు..
స్టోర్ కీపర్ టెక్నికల్ (ఎస్‌కేటీ): 300
అర్హత: ఇంటర్. దీంతో పాటు ఇంజినీరింగ్ పరికరాల స్టోర్ కీపింగ్/ వాహనాల పరిజ్ఞానం ఉండాలి. లేదంటే మూడు సంవత్సరాల ఉద్యోగానుభవం కావాలి.
ఆపరేటర్ కమ్యూనికేషన్: 261
అర్హత : 10వ తరగతితోపాటు వైర్‌లెస్ ఆపరేటర్ లేదా రేడియో మెకానిక్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా రేడియో టెక్నాలజీకి సంబంధించిన డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికెట్ కావాలి.
ఆపరేటర్ ఎక్స్‌కవేటింగ్ మెషినరీ (ఓఈఎం): 207
అర్హత: 10వ తరగతితో పాటు హెవీ మోటర్ డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్‌వేటర్ లేదా డోజర్ డ్రైవింగ్‌లో 6 నెలల ఉద్యోగానుభవం ఉండాలి.
ఎలక్ట్రీషియన్: 79
అర్హత : 10వ తరగతితో పాటు ఐటీఐ ఆటో ఎలక్ట్రీషియన్ సర్టిఫికెట్ కావాలి.
- పై నాలుగు పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.27,300 వేతనం అందిస్తారు.
డ్రాఫ్ట్స్‌మన్: 42
అర్హత : సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్, రెండేండ్ల డ్రాఫ్ట్స్‌మన్‌షిప్ లేదా ఆర్కిటెక్చర్ సర్టిఫికెట్ లేదా రెండు సంవత్సరాల డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, సంవత్సర ఉద్యోగానుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.28,200.
హిందీ టైపిస్ట్: 10
అర్హతలు: 10+2 ఉత్తీర్ణులై హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి.
ఎంపిక విధానం
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ స్టాండర్డ్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లతో నియామకాలు ఉంటాయి. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ లేదా సబ్జెక్టివ్ విధానంలో హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. పోస్టుల ఆధారంగా ఎగ్జామ్‌ను గంట నుంచి 3 గంటల వ్యవధితో నిర్వహిస్తారు. కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఇందులో అర్హులైనవారిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కి ఎంపిక చేస్తారు. పీఈటీలో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగును 10 నిమిషాల్లో పూర్తి చేయాలి. అర్హత సాధించినవారికి ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్, శారీరక ప్రమాణాల పరీక్ష (పీఎస్‌టీ) ఉంటాయి.
వయస్సు: 27 ఏండ్ల లోపువారై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.50. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు ఉండదు.
దరఖాస్తు: పోస్టు ద్వారా పంపాలి.
అడ్రస్: కమాండెంట్, జీఆర్‌ఈఎఫ్ సెంటర్, దిఘి క్యాంప్, పుణె - 411015.
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 4
వెబ్‌సైట్: https://bro.gov.in/
తాజావార్తలు
- ●Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
- ●Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..
- ●Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు
- ●POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష
- ●Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు
- ●Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమన్

Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..

Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు

POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష



