Carrymen | షాపింగ్‌కు కొత్త సొల్యూషన్.. బ్యాగులు మోయడానికి ‘క్యారీమెన్’!
Carrymen | ఢిల్లీ రద్దీ మార్కెట్లలో షాపింగ్ చేయడం అంటే చాలామందికి ఇష్టం. కానీ గంటల తరబడి నడవడం, భారీ షాపింగ్ బ్యాగులు మోసుకోవడం, ఫుడ్ క్యూల్లో నిలబడడం, కూర్చోడానికి చోటు వెతకడం వంటి ఇబ్బందులు మాత్రం అలసటకు గురిచేస్తాయి. ఇప్పుడు ఈ సమస్యకు ఓ స్టార్టప్ కొత్త పరిష్కారం తీసుకొచ్చింది.
Carrymen | ఢిల్లీ రద్దీ మార్కెట్లలో షాపింగ్ చేయడం అంటే చాలామందికి ఇష్టం. కానీ గంటల తరబడి నడవడం, భారీ షాపింగ్ బ్యాగులు మోసుకోవడం, ఫుడ్ క్యూల్లో నిలబడడం, కూర్చోడానికి చోటు వెతకడం వంటి ఇబ్బందులు మాత్రం అలసటకు గురిచేస్తాయి. ఇప్పుడు ఈ సమస్యకు ఓ స్టార్టప్ కొత్త పరిష్కారం తీసుకొచ్చింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ క్యారీ మెన్ (CarryMen) ప్రస్తుతం లజ్‌పత్ నగర్‌లో ప్రత్యేక సేవను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లు గంటకు రూ.149 చెల్లించి ట్రెయిన్డ్ అసిస్టెంట్లను బుక్ చేసుకోవచ్చు. వీరు షాపింగ్ సమయంలో కస్టమర్లతోపాటు తిరిగి బ్యాగులు మోస్తారు, ఫుడ్ క్యూల్లో నిలబడతారు, మెట్రో స్టేషన్ లేదా పార్కింగ్ వరకు తీసుకెళ్తారు. అవసరమైతే కూర్చోడానికి స్థలం కూడా వెతికి ఇస్తారు. ఈ సేవ ప్రధాన ఉద్దేశం ఒకటే. కస్టమర్లు ఎలాంటి భౌతిక ఒత్తిడి లేకుండా షాపింగ్‌ను ఎంజాయ్ చేయడం.
రూ.149కి ఏమేం సదుపాయాలు..?
క్యారీమెన్ ఈ సేవను లగ్జరీ పర్సనల్ షాపింగ్‌గా కాకుండా ప్రాక్టికల్ షాపింగ్ సపోర్ట్ సిస్టమ్‌గా ప్రచారం చేస్తోంది. గంటకు రూ.149 చొప్పున రెండు గంటలు, మూడు గంటలు లేదా నాలుగు గంటల స్లాట్లలో అసిస్టెంట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. త్వరగా షాపింగ్ ముగించేవారికి రెండు గంటల ప్యాకేజ్, ఎక్కువసేపు మార్కెట్‌లో తిరిగేవారికి మూడు గంటల ప్యాకేజ్, ఫుల్ డే షాపింగ్ ప్లాన్ చేసుకునేవారికి నాలుగు గంటల ఆప్షన్ అందుబాటులో ఉంది. స్టార్టప్ తెలిపిన వివరాల ప్రకారం, అసిస్టెంట్లు షాపింగ్ బ్యాగులు మోయడం మాత్రమే కాదు, రద్దీ వీధుల్లో దారి చూపించడం, ఫుడ్ స్టాల్స్ వద్ద క్యూల్లో నిలబడడం, మెట్రో లేదా పార్కింగ్ వరకు ఎస్కార్ట్ చేయడం వంటి సేవలను కూడా అందిస్తారు. ప్రస్తుతం ఈ సేవ లజ్‌పత్ నగర్ మార్కెట్‌లో అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో సరోజినీ నగర్, చాందినీ చౌక్ వంటి రద్దీ మార్కెట్లకు విస్తరించే ప్రణాళికలో ఉంది.
ఢిల్లీ మార్కెట్ల అనుభవమే ఐడియాగా..
క్యారీమెన్ వ్యవస్థాపకులు తెలిపిన ప్రకారం ఢిల్లీలోని లోకల్ మార్కెట్లలో షాపింగ్ చేసిన అనుభవమే ఈ స్టార్టప్‌కు కారణమైంది. ఎక్కువ నడక, భారీ బ్యాగులు, రద్దీ వీధులు, ఫుడ్ క్యూల వల్ల షాపింగ్ అనుభవం అలసటగా మారుతోందని వారు గుర్తించారు. ప్రజలకు షాపింగ్ అంటే ఇష్టం. కానీ దానికి వచ్చే ఫిజికల్ స్ట్రెస్ మాత్రం నచ్చదని స్టార్టప్ వ్యవస్థాపకుడు తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు. ఈ సేవ ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు, భారీగా షాపింగ్ చేసే కుటుంబాలకు ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టార్టప్ సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, ప్రారంభ దశలో వచ్చిన బుకింగ్స్‌లో ఎక్కువ భాగం వృద్ధ మహిళల నుంచే వచ్చాయి. ముఖ్యంగా దుస్తులు, కర్టెన్లు, బెడ్‌షీట్లు వంటి గృహోపకరణాలు కొనుగోలు చేసే వారు ఈ సేవను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో అసిస్టెంట్ గరిష్టంగా 12 కిలోల వరకు బరువు మోయగలడని కంపెనీ చెబుతోంది. అంతకంటే ఎక్కువ బరువు ఉంటే అదనపు సహాయం బుక్ చేసుకోవాలి. అదనంగా పోర్టబుల్ చెయిర్లు, గొడుగులు, పవర్ బ్యాంకులు, హైడ్రేషన్ సపోర్ట్ వంటి యాడ్-ఆన్ సేవలను కూడా క్యారీమెన్ అందిస్తోంది.

సోషల్ మీడియాలో చర్చ..
ఈ స్టార్టప్ ఐడియా సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీసింది. భారతీయ రద్దీ మార్కెట్లకు ఇది మంచి పరిష్కారం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ స్మిత ప్రకాష్ ఎక్స్‌లో స్పందిస్తూ, పెద్ద మాల్స్‌లో పర్సనల్ షాపర్లు ఉన్నప్పటికీ, ఇలాంటి ఎండ్-టు-ఎండ్ సహాయక సేవలు సాధారణంగా ఉండవని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాపార మోడల్ ఇతర నగరాల్లో కూడా సక్సెస్ కావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కొందరు వినియోగదారులు ఈ సేవ భారతీయ మార్కెట్లలో ఎంతవరకు సాఫీగా విస్తరిస్తుందనే ప్రశ్నలను కూడా లేవనెత్తారు. ముఖ్యంగా ధరల విషయంలో సెన్సిటివిటీ, నమ్మకం వంటి అంశాలు సవాళ్లుగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. క్యారీమెన్ మోడల్ ప్రస్తుతం పెరుగుతున్న అర్బన్ కన్వీనియెన్స్ స్టార్టప్స్ ట్రెండ్‌కు ఉదాహరణగా మారుతోంది. చిన్న చిన్న రోజువారీ సమస్యలకు చెల్లింపు ఆధారిత సర్వీసులతో పరిష్కారాలు అందించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.
డెలివరీ యాప్స్ లేదా కన్సియర్జ్ ప్లాట్‌ఫామ్‌లలా కాకుండా, ఈ సేవ పూర్తిగా ఆఫ్‌లైన్ షాపింగ్ అనుభవంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బేరసారాలు చేయడం, వస్తువులను స్వయంగా చూసి కొనడం ఇష్టపడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్, చాందినీ చౌక్ వంటి రద్దీ మార్కెట్లలో ఫిజికల్ స్ట్రెస్ లేకుండా షాపింగ్ అనుభవం కోరుకునే వారికి ఈ మోడల్ ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ సేవల అమలు విధానం, వినియోగదారుల నమ్మకం, ధరలు, నిరంతర డిమాండ్ వంటి అంశాలు ఈ స్టార్టప్ విజయాన్ని నిర్ణయించనున్నాయి.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●BRO Recruitment | బీఆర్వోలో జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్.. 899 పోస్టులతో నోటిఫికేషన్
- ●Supreme Court | ఈసీ చేపడుతున్న SIR చట్టబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ●Revanth Reddy | పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్
- ●UNSC | తీవ్ర పరిణామాలు తప్పవు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టిన భారత్
- ●Wanaparthy | అప్పు ఇచ్చినవారు వేధిస్తున్నారని.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య

Ponnam Prabhakar | ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్

BRO Recruitment | బీఆర్వోలో జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్.. 899 పోస్టులతో నోటిఫికేషన్

Supreme Court | ఈసీ చేపడుతున్న SIR చట్టబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Revanth Reddy | పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్



