త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sumithranand | నిజ‌మేదో అబ‌ద్ద‌మేదో రేవంతే మీడియా ముందు చెప్పాలి

Sumithranand | తన కుమార్తె నైమిషా రెడ్డి (Nymisha Reddy) విద్యాసంస్థలపై నిజమేదో, అబద్ధమేదో రేవంత్ రెడ్డే (Revanth Reddy) మీడియా ముందుకొచ్చి చెప్పాలని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ సూచించారు. క్రిశాంక్ రిమాండ్‌ను కోర్టు తిర‌స్క‌రించ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టులాంటిదన్నారు.

S

Telangana | Published On Oct 6, 2026, 5.08 pm IST

Sumithranand | నిజ‌మేదో అబ‌ద్ద‌మేదో రేవంతే మీడియా ముందు చెప్పాలి
Advertisement
  • క్రిశాంక్ రిమాండ్‌ను కోర్టు తిరస్కరించడం ప్రభుత్వానికి చెంప పెట్టు
  • సోషల్ మీడియా మా ఒక్క‌రిది కాదు.. ఎవరో కామెంట్స్ పెడితే మేమెలా బాధ్యుల‌మ‌వుతాం
  • రేవంత్ అస‌భ్యంగా మాట్లాడిన విష‌యాల‌పై పోలీసులు దృష్టి పెట్టాలి
  • టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్

Sumithranand | త్రినేత్ర న్యూస్: తన కుమార్తె నైమిషా రెడ్డి (Nymisha Reddy) విద్యాసంస్థలపై నిజమేదో, అబద్ధమేదో రేవంత్ రెడ్డే (Revanth Reddy) మీడియా ముందుకొచ్చి చెప్పాలని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ సూచించారు. క్రిశాంక్ రిమాండ్‌ను కోర్టు తిర‌స్క‌రించ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టులాంటిదన్నారు. సోష‌ల్ మీడియా (Social Media) అంద‌రిద‌ని.. ఎవ‌రో చేసిన కామెంట్స్‌కు బీఆర్ఎస్ బాధ్య‌త వ‌హించ‌ద‌న్నారు. రేవంత్ ఎన్నోసార్లు అస‌భ్యంగా మాట్లాడిన విష‌యాల‌పై పోలీసులు దృష్టి సారిస్తే బాగుంటుంద‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేశారు. కేటీఆర్‌ (KTR)ను హెచ్చ‌రించే స్థాయి బ‌ల్మూరి వెంక‌ట్‌కు ఉందా అని ప్ర‌శ్నించారు.

ప్ర‌శ్నిస్తే కేసులు, వేధింపులా?

రేవంత్ కుటుంబ అవినీతిని ప్రశ్నిస్తే పోలీస్ కేసులు, వేధింపులా? దళిత నేత క్రిశాంక్ ను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల అవినీతి గురించి ఎవరూ ప్రశ్నించకూడదా? రేవంత్ మా ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పరు? రేవంత్ కుటుంబంలోని మహిళలను బీఆర్‌ఎస్ సోషల్ మీడియా అవమానిస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

రేవంత్ రెడ్డి గతంలో కేటీఆర్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడలేదా? రేవంత్ రెడ్డి చేసిన అసభ్య ఆరోపణలకు ఆయనను ఎప్పుడో జైల్లో పెట్టాల్సింది. కేటీఆర్‌పై నీచమైన ఆరోపణలు చేసింది.. చేయించింది రేవంత్ రెడ్డే. ఏదైనా చెప్పదలచుకుంటే రేవంత్ రెడ్డికి వెంకట్ చెప్పాలి. కేటీఆర్‌ను హెచ్చరించే స్థాయి వెంకట్‌కు ఉందా? కేటీఆర్‌కు ఉన్న హుందాతనం రేవంత్‌కు ఎక్కడుంది?

తెలంగాణ ప్రయోజనాలే బీఆర్ఎస్‌కు ముఖ్యం. మేం ప్రజల పక్షాన సమస్యలపై పోరాడుతుంటే కాంగ్రెస్ నేతలు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. మా మీద కాంగ్రెస్ నేతల హెచ్చరికలను సహించేది లేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ స్థాయి నీచమైన భాషకు బీఆర్ఎస్ దిగజారలేదు. పాలన మీద కాంగ్రెస్ నేతలకు దృష్టి లేదు. పంపకాల మీదనే ఉంది. కాంగ్రెస్ నేతలవి చిల్లర ఎత్తుగడలు. రేవంత్ ఆటలు సాగనివ్వం.

మసి పూయాలనుకుంటే..

తెలంగాణ ప్రజలకు బీ ఆర్ ఎస్ పహారా. క్రిశాంక్ పై కేసైనా, బాల్క సుమన్ అరెస్టు అయినా అది దళితులపై వేధింపే. రేవంత్ ప్రతిపక్షంలో ఉండగా ఆయనపై మరిన్ని కేసులు పెట్టేవాళ్ళం. బీఆర్ఎస్‌కు మసి పూయాలనుకుంటే కుదరదు అని సుమిత్రానంద్ హిత‌వు ప‌లికారు.

ఈ ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ మహిళానేతలు మమతా, అన్నపూర్ణమ్మ, షకీలా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement