త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vanteru Prathap Reddy | రేవంత్! నిన్ను ఏ భాషలో ప్రశ్నించమంట‌వ్‌

Vanteru Prathap Reddy | తెలంగాణ సాధ‌కుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఇంటిపై దాడి చేయించిన దుర్మార్గ‌పు రేవంత్‌ను ఏ భాష‌లో ప్ర‌శ్నించాల‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 15, 2026, 4.45 pm IST

Vanteru Prathap Reddy | రేవంత్! నిన్ను ఏ భాషలో ప్రశ్నించమంట‌వ్‌
Advertisement
  • పాల‌న‌ చేత‌కాక‌పోతే దిగిపో
  • భ‌విష్య‌త్‌లో ప్ర‌తిప‌క్షంలోకొస్త‌వ్‌.. అప్పుడు నీ ఇంటి మీద కూడా దాడి చేయ‌మంట‌వా?
  • అమాయ‌కుల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించ‌డం స‌రికాదు
  • మీడియా స‌మావేశంలో వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి రుస‌రుస

Vanteru Prathap Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ సాధ‌కుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఇంటిపై దాడి చేయించిన దుర్మార్గ‌పు రేవంత్‌ను ఏ భాష‌లో ప్ర‌శ్నించాల‌ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిప‌డ్డారు. కాంగ్రెస్ క్రిమినల్స్ గ్యాంగులుగా బయలుదేరి తెలంగాణ ఆత్మ గౌరవం మీద దాడి చేశార‌ని ఆరోపించారు. ఇందుకోసం దాదాపు 100 గ్యాంగులు పని చేశాయన్నారు. దాడి చేయడానికి వచ్చిన కాంగ్రెస్ గూండాలను అడ్డుకుంటే అమాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని వాపోయారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై రుస‌రుస‌లాడారు.

గజ్వెల్‌లో రేవంత్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రేవంత్ ! పాలన చేత కాకపోతే ఊరుకో.. లేదంటే రాజీనామా చెయ్‌. ఈ మూర్ఖపు సీఎం ప్రోద్భలంతోనే కేసీఆర్ ఇంటి మీదకు పోయారు. ఈ దాడిని ప్రతిఘటించిన వారిని జైల్లో పెడుతున్నారు. సీఎం వ్యవస్థలన్నింటినీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను భ్రస్టు పట్టించారు. ఇలాంటి వ్యవస్థను ప్రజలు చీదరించుకుంటున్నారు.

ప్రజాస్వామ్యం అంటే రేవంత్ ఇంటి కోసం కాదు. ప్రజల మీద దాడులు ఎవ్వరూ సహించరు. దాడులకు వచ్చిన వారి మీద మార్కుక్ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా. రేవంత్ రెడ్డి శాశ్వతంగా సీఎం సీటులో ఉండరు. భవిష్యత్ లో ప్రతిపక్ష స్థానానికి మారుతారు. అపుడు ఆయన నివాసం మీద కూడా దాడి చేయాలా? అని వంటేరు ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement