త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagarjuna Sagar | తాగునీటి అవ‌స‌రాల‌కు.. నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు నీటి విడుద‌ల‌

Nagarjuna Sagar | ఎల్‌నినో ప్ర‌భావంతో తాగునీటి అవ‌స‌రాల కోసం నాగార్జున‌సాగ‌ర్ (Nagarjuna Sagar) ఎడ‌మ కాలువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 6000 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు.

G

Telangana | Published On Oct 12, 2026, 10.49 am IST

Nagarjuna Sagar | తాగునీటి అవ‌స‌రాల‌కు.. నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు నీటి విడుద‌ల‌
Advertisement

Nagarjuna Sagar | త్రినేత్ర న్యూస్‌: ఎల్‌నినో ప్ర‌భావంతో తాగునీటి అవ‌స‌రాల కోసం నాగార్జున‌సాగ‌ర్ (Nagarjuna Sagar) ఎడ‌మ కాలువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 6000 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. వానాకాలం ముగిసిన‌ప్ప‌టికీ ఆశించిన స్థాయిలో వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డం, ఎండ‌ల తీవ్ర‌త‌తో ఎడ‌మ కాలువ (Left Canal) ప‌రిధిలోని చెరువుల్లో నీటి నిల్వ‌లు అడుగంటి పోయాయి. ఈ నేప‌థ్యంలో గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో తాగునీటి అవ‌స‌రాలు (Drinking Water) తీర్చేందుకు ఈ నీర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. కాలువ దిగువ ప్రాంతాల ప్ర‌జ‌లు, రైతులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, కాల్వ‌ల్లో ఈత‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని సూచించారు.

సాగ‌ర్‌లో ప్ర‌స్తుతం 540.29 అడుగుల నీటిమ‌ట్టం ఉన్న‌ది. ప్రాజెక్టు పూర్తిస్థాయి 590 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్ల సామ‌ర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ఇప్పుడు 188.95 టీఎంసీలు ఉన్నాయి. కుడి, ఎడ‌మ కాలువ‌కు క‌లిపి మొత్తం 11,049 క్యూసెక్కులు విడుద‌ల చేస్తున్నారు.

Advertisement
Advertisement