త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagat Singh | పంజాబ్ ఓట‌రు జాబితాలో స్వాతంత్య్ర‌ సమరయోధుడి ఫొటో..

Bhagat Singh | ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై (SIR) ఓవైపు ఆందోళ‌న‌లు జ‌రుగుతుంటే.. మ‌రోవైపు ఓట‌ర్ లిస్టుల్లో (Voter List) త‌ప్పులు దొర్లుతూనే ఉన్నాయి. పంజాబ్‌లో (Punjab) ఇటీవల ప్ర‌చురించిన ఓట‌రు జాబితాలో స్వాతంత్య్ర‌ సమరయోధుడు భగత్‌సింగ్ (Bhagat Singh) ఫొటో ద‌ర్శ‌నమిచ్చింది.

G

National | Published On Oct 12, 2026, 8.56 am IST

Bhagat Singh | పంజాబ్ ఓట‌రు జాబితాలో స్వాతంత్య్ర‌ సమరయోధుడి ఫొటో..
Advertisement

Bhagat Singh | త్రినేత్ర న్యూస్‌: ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై (SIR) ఓవైపు ఆందోళ‌న‌లు జ‌రుగుతుంటే.. మ‌రోవైపు ఓట‌ర్ లిస్టుల్లో (Voter List) త‌ప్పులు దొర్లుతూనే ఉన్నాయి. పంజాబ్‌లో (Punjab) ఇటీవల ప్ర‌చురించిన ఓట‌రు జాబితాలో స్వాతంత్య్ర‌ సమరయోధుడు భగత్‌సింగ్ (Bhagat Singh) ఫొటో ద‌ర్శ‌నమిచ్చింది. ఓ ఓటర్ పేరుకు ఎదురుగా ఆయన ఫొటో కనిపించడంతో రాజకీయంగా దుమారం రేగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్‌ నేత, ఎంపీ అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్ (Amarinder Singh Raja Warring) లేవనెత్తారు. లూథియానా (Ludhiana) ఈస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ జాబితాలోని పార్ట్‌ 38 సీరియల్‌ నంబర్‌ 422 వద్ద భగత్‌సింగ్‌ను ఫొటో ఉందని వారింగ్‌ ఆరోపించారు. ఓటర్ ఫొటో స్థానంలో స్వాతంత్య్ర‌ సమరయోధుడి ఫొటో ప్రచురించడం ఏంటంటూ ఎన్నికల అధికారులపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, ఈ అంశంపై లూథియానా జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. ఈ అంశాన్ని ఇప్ప‌టికే గుర్తించి సరిచేశామని, ఎంపీ అమరీందర్‌ సింగ్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమ‌ర్శించారు. గతంలో ప్రచురించిన ఓటర్ జాబితాలో ఈ పొరపాటు చోటుచేసుకుందన్నారు. ఆగస్టు 13న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితాలోనూ అది కొనసాగిందని చెప్పారు. SIRలో భాగంగా దానిని గుర్తించి సరిచేసినట్లు వెల్ల‌డించారు. సరైన ఫొటోతో తుది ఓటరు జాబితాను సిద్ధం చేశామని, అక్టోబర్‌ 12న దానిని ప్రచురిస్తామ‌ని చెప్పారు.

ప్ర‌త్యేక ఓట‌రు స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపిస్తూ, దానికి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలంటూ గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP) నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పంజాబ్ ఓట‌రు జాబితాలో లోపాలు బ‌య‌ట‌ప‌ట‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement