Secretariat | రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్.. సచివాలయంలో మంచినీటి సరఫరా బంద్
Secretariat | సచివాలయంలో (Secretariat) ఉద్యోగులకు మంచినీటి కష్టాలు తప్పడం లేదు. ఏండ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో ఏజెన్సీలు మంచినీటి సరఫరాను (Drinking Water Crisis) నిలిపివేశాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది తాగునీటికి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Secretariat | త్రినేత్ర న్యూస్: సచివాలయంలో (Secretariat) ఉద్యోగులకు మంచినీటి కష్టాలు తప్పడం లేదు. ఏండ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో ఏజెన్సీలు మంచినీటి సరఫరాను (Drinking Water Crisis) నిలిపివేశాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది తాగునీటికి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో డిపార్ట్‌మెంట్ నుంచి రూ.లక్షల్లో బకాయిలు రావాల్సి ఉండటంతో (Pending Bills).. మొత్తం నాలుగు ఏజెన్సీలు కలిపి సుమారు రూ.50 లక్షల బిల్లులు చెల్లించాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం, పాత బకాయిలు మొత్తం క్లియర్ చేస్తేనే మళ్లీ వాటర్ క్యాన్లు పంపిస్తామని తేల్చిచెప్పడంతో పేషీల అధికారులకు దిక్కుతోచలేదు. చివరకు ఉద్యోగులు, సిబ్బంది ఎవరి బాటిల్స్ వారే ఇంటి నుంచి తెచ్చుకోవాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
దీనికి తోడు సచివాలయంలోని మంచి నీటి ఫిల్డర్లు పని చేయడం ఆగిపోయాయి. దీంతో ఉద్యోగులు బయట నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉద్యోగులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలోనూ ఇప్పటికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యల నేపథ్యంలో లంచ్ బంద్ చేశారు. ఇప్పుడు తాగునీటి సరఫరా కూడా నిలిచిపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ వ్యవహారంపై సెక్రటేరియట్ అధికారులు స్పందించాల్సి ఉంది.
కాగా, సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని జలమండలి (Jalamandali) స్పష్టం చేసింది. మంచి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. సమాచారం అందిన వెంటనే సచివాలయంలో సంపును జలమండలి అధికారులు పరిశీలించారు. మంచినీటి సరఫరా యథావిధిగా కొనసాగిందని, ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది.
సంబంధిత వార్తలు

Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్
అక్టోబర్ 4, 2026

Harish Rao | సచివాలయం నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు: హరీశ్‌రావు
సెప్టెంబర్ 28, 2026

Minister Seethakka | రూ.1000 కోట్లతో 5118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●NRI BRS UK | తెలంగాణలో ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్: ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే
- ●Nobel Prize 2026 | మెదడు గుట్టుపై అధ్యయనం.. ఈ ఏడాది ముగ్గురికి వైద్య నోబెల్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఊరట.. 472 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్..
- ●Osmania University Research Labs | ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ విప్లవం: రూ.1.75 కోట్లతో 3 హైటెక్ ల్యాబ్‌లు ప్రారంభం.. 24 గంటలూ విద్యార్థులకు ఏఐ సెంటర్
- ●Gajjela Kantham | కోహినూర్‌లో 25 శాతం వాటా తీసుకున్నవ్.. అయ్యకు అబ్బకు పుడ్తే అబద్దమని చెప్పు
- ●GST Council | జీఎస్టీ కౌన్సిల్లో కీలక ప్రతిపాదనలు.. వీటిపై పన్ను భారం తగ్గే ఛాన్స్..?

NRI BRS UK | తెలంగాణలో ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్: ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే

Nobel Prize 2026 | మెదడు గుట్టుపై అధ్యయనం.. ఈ ఏడాది ముగ్గురికి వైద్య నోబెల్

Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఊరట.. 472 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్..

Osmania University Research Labs | ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ విప్లవం: రూ.1.75 కోట్లతో 3 హైటెక్ ల్యాబ్‌లు ప్రారంభం.. 24 గంటలూ విద్యార్థులకు ఏఐ సెంటర్



