త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Father Funeral | ఆస్తి కోసం తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను ఆపిన కూతుర్లు..

Father Funeral | త్రినేత్ర న్యూస్‌: ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను (Father Funeral) కూతుర్లు ఆపేశారు. ఆస్తి పంప‌కాలు జ‌రిగిన త‌ర్వాతే అంతిమ సంస్కారాల‌కు అనుమ‌తిస్తామ‌ని ప‌ట్టుప‌ట్టారు.

G

Andhra pradesh | Published On Oct 12, 2026, 7.21 am IST

Father Funeral | ఆస్తి కోసం తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను ఆపిన కూతుర్లు..
Advertisement

Father Funeral | త్రినేత్ర న్యూస్‌: ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను (Father Funeral) కూతుర్లు ఆపేశారు. ఆస్తి పంప‌కాలు జ‌రిగిన త‌ర్వాతే అంతిమ సంస్కారాల‌కు అనుమ‌తిస్తామ‌ని ప‌ట్టుబ‌ట్టి కూర్చుకున్నారు. ఈ ఘ‌ట‌న ఆంధ్రప్ర‌దేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది.

స‌త్య‌సాయి జిల్లా రొళ్ల మండలం కే.బ్యాడి­గెరకి చెందిన ఈశ్వరప్ప (94) వృద్ధాప్యంతో శనివారం మృతి చెందారు. ఆయ‌న‌కు ముగ్గురు కుమార్తెలు (Daughters) ఉన్నారు. అయితే త‌న ఆస్తి మొత్తం పద్మ అనే కుమార్తెకు ఇచ్చారు. అయితే త‌మ‌కూ ఆస్తిలో భాగం కావాలంటూ మిగిలిన ఇద్ద‌రు కూతుళ్లు గౌరమ్మ, మంజుల అంత్య‌క్రియ‌ల‌ను అడ్డుకున్నారు. ఆస్తిలో తమకూ భాగం ఇచ్చే వరకు అంత్యక్రియలు చేయకూడదని ప‌ట్టుప‌ట్టుకు కూర్చున్నారు. కుటుంబ స­భ్యు­లు, బంధువులు, గ్రామస్తులు ఎంత నచ్చ­జెప్పినా వినలేదు. ఆస్తి పంపకం తర్వాతే అంత్యక్రియలకు ఒప్పు­కుంటామని చెప్పారు. పోలీ­సులు నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామ పెద్దలు కలుగజేసుకుని గౌరమ్మ, మంజులకు 30 సెంట్ల చొప్పున, పద్మ­కు 60 సెంట్ల భూమి పంపకం చేసేలా ఒప్పందం కుదిర్చారు. దీంతో ఈశ్వరప్ప అంత్యక్రియలు జరిగాయి.

Advertisement
Advertisement