CM Revanth Reddy | ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తం.. అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
CM Revanth Reddy | ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ ముప్పును ముందుగానే గుర్తించి, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy | ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ ముప్పును ముందుగానే గుర్తించి, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుంచి వచ్చే జూన్ వరకు తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను అధిగమించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగా అంచనా వేయడంలో విఫలమైతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక సూచనలు చేశారు.
విద్యుత్ సంక్షోభంపై ప్రత్యేక దృష్టి
ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ సమస్యలు తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, అయితే మార్కెట్‌లో అవసరమైనంత విద్యుత్ అందుబాటులో లేని పరిస్థితి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్‌పై ఆధారపడే పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కోవిడ్ తరహాలో కార్యాచరణ
కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తరహాలోనే ఎల్‌నినో ముప్పును అధిగమించేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రతి దశలో ప్రజలను భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం సినిమా, మీడియా, కళాజాతలతో పాటు వివిధ ప్రచార మాధ్యమాలను వినియోగించుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
చుక్క నీరూ వృథా కావొద్దు
భవిష్యత్తులో నీటి సమస్య తీవ్రతరం కాకుండా ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తాగునీరు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సంక్షోభ నివారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Congress Party | 12న కాంగ్రెస్ మహా నిరసన.. ఢిల్లీకి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు
అక్టోబర్ 10, 2026

Suicide | చిట్టి డబ్బుల విషయంలో గొడవ.. పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి
అక్టోబర్ 10, 2026

KTR | రూ. 3,296 కోట్ల రేడియల్ రోడ్ల కుంభకోణంపై సీఎం సమాధానం చెప్పాలి
అక్టోబర్ 10, 2026
తాజావార్తలు
- ●Congress Party | 12న కాంగ్రెస్ మహా నిరసన.. ఢిల్లీకి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు
- ●Suicide | చిట్టి డబ్బుల విషయంలో గొడవ.. పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి
- ●Brahmamudi Kavya | హీరోయిన్గా బ్రహ్మముడి కావ్య - జబర్ధస్థ్ కమెడియన్ డైరెక్షన్లో తెలుగు వెబ్‌సిరీస్
- ●Ranabaali Vijay Deverakonda | రాజమౌళితో సినిమా చేస్తే తప్ప.. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను
- ●Sharannavaratri | శరన్నవరాత్రులకు వేళాయె!
- ●Ramayana Serial | రామాయణ సీరియల్లోని సీతారాముల కాంబినేషన్లో బాలీవుడ్ మూవీ - రణబీర్ సినిమాకు పోటీగా రిలీజ్

Congress Party | 12న కాంగ్రెస్ మహా నిరసన.. ఢిల్లీకి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు

Suicide | చిట్టి డబ్బుల విషయంలో గొడవ.. పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి

Brahmamudi Kavya | హీరోయిన్గా బ్రహ్మముడి కావ్య - జబర్ధస్థ్ కమెడియన్ డైరెక్షన్లో తెలుగు వెబ్‌సిరీస్

Ranabaali Vijay Deverakonda | రాజమౌళితో సినిమా చేస్తే తప్ప.. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను



