Anganwadi Recruitment | అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ ఉద్యోగాలు.. ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లో 697 ఖాళీలు
Anganwadi Recruitment | రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్‌వాడి టీచర్లు, ఆయా పోస్టులను (Anganwadi Recruitment) ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. మొత్తం 15,982 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నది.
Anganwadi Recruitment | త్రినేత్ర న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్‌వాడి టీచర్లు, ఆయా పోస్టులను (Anganwadi Recruitment) ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. మొత్తం 15,982 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నది. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ (Kumram Bheem Asifabad) జిల్లాల్లోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 433 పోస్టులు, వికారాబాద్ (Vikarabad)జిల్లా పరిధిలోని (కోడంగల్, మార్పల్లి, పరిగి, తాండూర్, వికారాబాద్) ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో 264 అంగన్‌వాడి టీచర్ (Anganwadi Teacher), ఆయా పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
మొత్తం ఖాళీలు: 433 పోస్టులు
సిర్పూర్-టీ: 28 (టీచర్-9, ఆయా-19)
కాగజ్‌నగర్: 11 (టీచర్-4, ఆయా-7)
ఆసిఫాబాద్: 124 (టీచర్-49, ఆయా-75)
జైనూర్: 163 (టీచర్-39, ఆయా-124)
వాంకిడి: 107 (టీచర్-52, ఆయా-55)
అర్హతలు: అభ్యర్థుల తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్ (Anganwadi Helper) పోస్టుకు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరూ అందుబాటులో లేనట్లయితే, పదోతరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు వయసు 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
అంగన్‌వాడీ టీచర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే సంబంధిత వార్డులోనూ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలోనూ నివసిస్తూ ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక వార్డు స్థానికులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ).. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించింది. ఎంపికలో మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 23
వెబ్‌సైట్: https://wdcw.tg.nic.in/
వికారాబాద్ జిల్లాలో..
మొత్తం పోస్టులు: 264 (అంగన్‌వాడీ టీచర్లు 102, అంగన్‌వాడీ ఆయా 162)
కోడంగల్: టీచర్లు - 13, ఆయా - 31 (మొత్తం: 44)
మార్పల్లి: టీచర్లు - 21, ఆయా - 14 (మొత్తం: 35)
పరిగి: టీచర్లు - 27, ఆయా - 78 (మొత్తం: 105)
తాండూర్: టీచర్లు - 23, ఆయా - 28 (మొత్తం: 51)
వికారాబాద్: టీచర్లు - 18, ఆయా - 11 (మొత్తం: 29)
అర్హతలు: అభ్యర్థుల తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుకు సంబంధించి, ఇంటర్మీడియట్ / 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరూ అందుబాటులో లేనట్లయితే, తదుపరి పదోతరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియ: నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్/ చైర్మన్ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 24
ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు తమ దరఖాస్తు కాపీ, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలి.
వెబ్‌సైట్: https://wdcw.tg.nic.in/
అప్‌లోడ్ చేయవలసిన ధ్రువపత్రాలు
- పుట్టిన తేదీ/వయసు ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- విద్యార్హత ధ్రువీకరణ పత్రం (ఇంటర్/ఆపై విద్యార్హత మార్కుల జాబితా)
- నివాస ధ్రువీకరణ పత్రం
- అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్
- వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
- ఆనాథ అయితే అనాధ ధ్రువీకరణ పత్రం
పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Father Funeral | ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపిన కూతుర్లు..
- ●Strike | సమ్మె బాటలో జూనియర్ డాక్టర్లు.. ఉస్మానియాలో నిలిచిపోనున్న సేవలు
- ●Horoscope | అక్టోబర్ 12 రాశిఫలాలు.. వినూత్న ఆలోచనలు అవసరం!
- ●Kobali Lyrical Song Release | గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ 'రణబాలి' - 'కోబలి' సాంగ్ వచ్చేసింది
- ●Navaratri Brahmotsavams | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- ●CJP Delhi Protest | ఢిల్లీలో రెండో రోజూ హైడ్రామా.. సుప్రీంకోర్టు సీరియస్.. ముంబైకి పాకిన సెగ

Father Funeral | ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపిన కూతుర్లు..

Strike | సమ్మె బాటలో జూనియర్ డాక్టర్లు.. ఉస్మానియాలో నిలిచిపోనున్న సేవలు

Horoscope | అక్టోబర్ 12 రాశిఫలాలు.. వినూత్న ఆలోచనలు అవసరం!

Kobali Lyrical Song Release | గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ 'రణబాలి' - 'కోబలి' సాంగ్ వచ్చేసింది






