త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Metro Common Pass | ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధ‌ర‌ల‌పై పునఃపరిశీలన.. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామ‌న్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

RTC Metro Common Pass | హైద‌రాబాద్‌లో ప్ర‌జార‌వాణాను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా మార్చేందుకు ప్రభుత్వం ఇటీవ‌ల‌ ప్ర‌వేశ‌పెట్టిన ఆర్టీసీ-మెట్రో కామ‌న్‌పాస్‌పై (RTC Metro Common Pass) ప్ర‌యాణికులు విముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు.

G

Telangana | Published On Oct 12, 2026, 10.03 am IST

RTC Metro Common Pass | ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధ‌ర‌ల‌పై పునఃపరిశీలన.. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామ‌న్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

RTC Metro Common Pass | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లో ప్ర‌జార‌వాణాను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా మార్చేందుకు ప్రభుత్వం ఇటీవ‌ల‌ ప్ర‌వేశ‌పెట్టిన ఆర్టీసీ-మెట్రో కామ‌న్‌పాస్‌పై (RTC Metro Common Pass) ప్ర‌యాణికులు విముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌వేశ‌పెట్టిన ఈ పాస్‌ల‌కు ఆశించిన ఆధ‌ర‌ణ ల‌భించ‌డం లేదు. దీనికి ధ‌ర‌లు (Common Pass Fare) ఎక్కువగా ఉండ‌ట‌మే కార‌ణం. రోజువారీ పాస్ ధ‌ర రూ.400 ఉండ‌గా, మంత్లీ సాప్‌కు రూ.8500గా నిర్ణ‌యించారు. డైలీ పాస్ కొనుగోలు చేసేందుకు ప్ర‌యాణికులు కొంత మేర‌కు ఆస‌క్తి చూపిస్తున్న‌ప్ప‌టికీ, మంత్లీపాస్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తున్న‌ది.

ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కామన్ పాస్ ఛార్జీలు అధికంగా (Common Pass Fare) ఉన్నాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీలను సమీక్షించాలని నిర్ణయించామ‌ని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) తెలిపారు. ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా ఉండగా, ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ (TGSRTC) వాటా రూ.100గా ఉంది. అదేవిధంగా నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500గా ఉండగా, ఇందులో మెట్రో (Hyderabad Metro) వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500గా నిర్ణయించార‌ని తెలిపారు.

ఈ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ఛార్జీలను పునఃపరిశీలించాలని నిర్ణయించామ‌న్నారు. వాస్తవ పరిస్థితులను సమీక్షించి, ప్రజలకు అందుబాటులో ఉండేలా కామన్ పాస్ ధరలను నిర్ణయించే అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామ‌ని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఆర్టీసీ, మెట్రో సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమ‌ని వెల్ల‌డించారు. ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా, వారి అవసరాలకు అనుగుణంగా, సౌకర్యవంతమైన ధరలతో కామన్ పాస్ విధానం అమలయ్యేలా తగిన నిర్ణయం తీసుకుంటామ‌న్నారు.

ప్రజా రవాణాను మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమ‌ని వెల్ల‌డించారు. ప్రజలపై అదనపు ఛార్జీల భారం మోపడం త‌మ‌ లక్ష్యం కాద‌న్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

 

Advertisement
Advertisement