Rainfall | హైదరాబాద్‌లో భారీగా లోటు వర్షపాతం.. అడుగంటిన భూగర్భ జలాలు
Rainfall | ఈ వర్షాకాలం హైదరాబాద్( Hyderabad )లో భారీగా లోటు వర్షపాతం( Rainfall deficit ) నమోదైంది. దీంతో రాబోయే రోజుల్లో నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే భూగర్భ జలాలు( Ground Water ) అడుగంటాయి.
Rainfall | త్రినేత్ర న్యూస్ : ఈ వర్షాకాలం హైదరాబాద్( Hyderabad )లో భారీగా లోటు వర్షపాతం( Rainfall deficit ) నమోదైంది. దీంతో రాబోయే రోజుల్లో నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే భూగర్భ జలాలు( Ground Water ) అడుగంటాయి. మరోవైపు జంట జలాశయాలతో పాటు నగరానికి తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లలోకి ఇన్‌ఫ్లో ఆగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గృహ నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది.
అయితే భూగర్భ జల శాఖ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2026 నాటికి హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 627.2 మి.మీ. కు గానూ కేవలం 458.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే దాదాపు 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నగరంలో మొత్తం 16 మండలాలు ఉండగా, 13 మండలాల్లో 20 నుంచి 59 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చార్మినార్‌లో 39 శాతం, సైదాబాద్‌లో 38, నాంపల్లి, తిరుమలగిరిలో 35, బండ్లగూడలో 33, అంబర్‌పేటలో 31, మారేడ్‌పల్లిలో 30, ఖైరతాబాద్‌లో 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కేవలం గొల్కోండ, సికింద్రాబాద్, ముషీరాబాద్ మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ 13 మండలాల్లో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది.
ఈ వర్షపాత లోటు ప్రభావం నేరుగా రోజువారీ గృహ నీటి సరఫరాపై పడనుందని పర్యావరణ వేత్తలు పేర్కొన్నారు. నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో మందగించింది. దీంతో జలమండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. వర్షాభావం కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుండి హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ విపరీతంగా పెరిగాయని, బోర్డు ఏర్పాటైన తర్వాత ఈ స్థాయి డిమాండ్ రావడం ఇదే మొదటిసారి అని జలమండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!




