KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?
KTR | జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను కూడా ఎందుకు పెంచడం లేదు? కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటి? అని నిలదీశారు.
అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచడం లేదు..?
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే
అనేక రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్’లో కేటీఆర్
KTR | త్రినేత్ర న్యూస్ : జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను కూడా ఎందుకు పెంచడం లేదు? కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటి? అని నిలదీశారు. ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్’లో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ శాపంగా మారుతుంది. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24 శాతం నుంచి 19 శాతానికి తగ్గింది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను కూడా ఎందుకు పెంచడం లేదు? కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటి? ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలకు మహిళా రిజర్వేషన్‌ను ఎందుకు అమలు చేయడం లేదు? దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మేము మద్దతు ఇస్తాం. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీలను మేము నమ్మలేం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణలో ఎందుకు పెంచలేదు..?
తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా కేంద్రం ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదు. కేవలం తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగానే బీజేపీ డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్తోందని మేము భావిస్తున్నాం. అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు పెంచలేదు? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదన్న అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం
- ●CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు
- ●Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!
- ●OnePlus | వన్‌ప్లస్ దీపావళి సేల్.. స్మృతి మంధానాతో ప్రచారం..
- ●CM Revanth Reddy | అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నాం
- ●Rabi Crops | రబీ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం

CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు

Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!

OnePlus | వన్‌ప్లస్ దీపావళి సేల్.. స్మృతి మంధానాతో ప్రచారం..




