KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం
KTR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ఉండదని, గత 26 ఏండ్లలో ఒక్కసారి కూడా ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ కుండబద్ధలు కొట్టారు.
మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ
సైద్ధాంతికంగా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం
అలాంటప్పుడు బీజేపీతో పొత్తు ఎట్ల పెట్టుకుంటం
‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్’లో కేటీఆర్
KTR | త్రినేత్ర న్యూస్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ఉండదని, గత 26 ఏండ్లలో ఒక్కసారి కూడా ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ కుండబద్ధలు కొట్టారు. ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్’లో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం. అలాంటప్పుడు బీజేపీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రస్తుతం RRR - Recall, Regret and Revolt పరిస్థితి కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 420కి పైగా హామీలు ఇచ్చినా, వాటిలో ఒక్కటినీ పూర్తిగా అమలు చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం ఉంది. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు తమ నిర్ణయాన్ని పునరాలోచించే పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో Regret నుంచి Revolt దిశగా మార్పు కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ నాయకత్వానికి విధేయుడిగా వ్యవహరిస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?
- ●CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు
- ●Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!
- ●OnePlus | వన్‌ప్లస్ దీపావళి సేల్.. స్మృతి మంధానాతో ప్రచారం..
- ●CM Revanth Reddy | అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నాం
- ●Rabi Crops | రబీ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు

Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!

OnePlus | వన్‌ప్లస్ దీపావళి సేల్.. స్మృతి మంధానాతో ప్రచారం..




