త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | సిద్దిపేట స‌భ‌కు వెళ్లి మ‌హిళ మృతి.. నివాళుల‌ర్పించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | కొమ్ము సారవ్వ మృతిప‌ట్ల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ద‌వాఖాన‌ మార్చురీలో ఉన్న‌ సారవ్వ పార్థివ దేహానికి నివాళులర్పించారు.

G

Telangana | Published On Nov 20, 2026, 9.56 am IST

Ponnam Prabhakar | సిద్దిపేట స‌భ‌కు వెళ్లి మ‌హిళ మృతి.. నివాళుల‌ర్పించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్‌: సిద్దిపేట‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సభ‌కు వెళ్లిన ఓ మ‌హిళ బ‌స్సు కింద‌ప‌డి మృతిచెందారు. హుస్నాబాద్ మండ‌లంలోని నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (Kommu Saravva) సీఎం స‌భ‌కు హాజ‌ర‌య్యారు. బ‌హిరంగ స‌భ ముగిసిన త‌ర్వాత బస్సు కోసం వెళ్తుండ‌గా ప్రమాదానికి గురై మ‌ర‌ణించారు. ఆమె మృతిప‌ట్ల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ద‌వాఖాన‌ మార్చురీలో ఉన్న‌ సారవ్వ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా, సారవ్వ మహిళా సంఘం సభ్యురాలు కావడంతో మహిళా సంఘం సభ్యులకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. వారి కుటుంబానికి అండగా నిలబడి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement