High Court’s Verdict | హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి కలెక్టర్‌కు జైలు శిక్ష
High Court's Verdict | కోర్టు ధిక్కరణ కేసు (Contempt of Court Case)లో తెలంగాణ హైకోర్టు (High Court) సోమవారం సంచలన తీర్పు(Verdict) ఇచ్చింది.
- కోర్టు ధిక్కరణ కేసులో కఠిన నిర్ణయం
- శిక్ష అమలును నాలుగు వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటన
- ఈలోపు అప్పీలు చేసుకునేందుకు అవకాశం
High Court's Verdict | త్రినేత్ర న్యూస్: కోర్టు ధిక్కరణ కేసు (Contempt of Court Case)లో తెలంగాణ హైకోర్టు (High Court) సోమవారం సంచలన తీర్పు(Verdict) ఇచ్చింది. రంగారెడ్డి (Rangareddy) కలెక్టర్ నారాయణరెడ్డి (Collector Narayana Reddy)కి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ధారించింది. అయితే అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 4 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
అసలు కేసు ఏంటంటే?
రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-A ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలంటూ బాధితులు దాఖలు చేసిన వినతిని పరిశీలించాలని గతంలో హైకోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. 2025, ఆగస్టులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధితులు 2025, అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ నమోదైన తర్వాతే అధికారులు మొద్దు నిద్ర నుంచి మేలుకున్నారు. బాధితులకు నోటీసులు జారీ చేసి, 2026, ఫిబ్రవరి 26న వారి వినతిని తిరస్కరించారు. ఆ తర్వాత జులై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే ఇలా ప్రక్రియను చుట్టేయడంపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది.
పిటిషన్ దాఖలయ్యాక నామమాత్రంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఐఏఎస్ స్థాయి అధికారి కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు తాజాగా ధర్మాసనం కలెక్టర్‌కు జైలు శిక్ష విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Charagonda Govt High School | ఇక్కడే ఉండండి సార్.. మమ్మల్ని విడిచి వెళ్లకండి ప్లీజ్
నవంబర్ 9, 2026

Road Accident | ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీకి చేరేదే.. ఓయూ విద్యార్థిని ఎలా చనిపోయిందంటే!
నవంబర్ 9, 2026

SplashBI GCC Launch | జీసీసీలను సంప్రదాయ సేవలకే పరిమితం కానివ్వం.. ఆవిష్కరణ కేంద్రాలుగా తయారు చేస్తం
నవంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Delhi Narela Firecracker Accident | ఢిల్లీలో పండగ పూట పెను విషాదం: చాతీలోకి దూసుకెళ్లిన పటాకులు.. 10 ఏళ్ల బాలుడు మృతి
- ●Dimagi Naxals | ప్రధాని "దిమాగీ నక్సల్స్" వ్యాఖ్యలు సిగ్గు చేటు.. అసలు దీని అర్థమేంటి..? : CPI ప్రధాన కార్యదర్శి డి. రాజా
- ●National Career Service | ఉద్యోగం కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు.. కేంద్ర కార్మిక శాఖ కీలక హెచ్చరిక..
- ●Charagonda Govt High School | ఇక్కడే ఉండండి సార్.. మమ్మల్ని విడిచి వెళ్లకండి ప్లీజ్
- ●Personal Finance | 20 ఏళ్ల వయస్సులో చేసే ఈ 5 ఆర్థిక తప్పులతో.. భవిష్యత్తులో లక్షల నష్టం..
- ●Road Accident | ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీకి చేరేదే.. ఓయూ విద్యార్థిని ఎలా చనిపోయిందంటే!

Delhi Narela Firecracker Accident | ఢిల్లీలో పండగ పూట పెను విషాదం: చాతీలోకి దూసుకెళ్లిన పటాకులు.. 10 ఏళ్ల బాలుడు మృతి

Dimagi Naxals | ప్రధాని "దిమాగీ నక్సల్స్" వ్యాఖ్యలు సిగ్గు చేటు.. అసలు దీని అర్థమేంటి..? : CPI ప్రధాన కార్యదర్శి డి. రాజా

National Career Service | ఉద్యోగం కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు.. కేంద్ర కార్మిక శాఖ కీలక హెచ్చరిక..

Charagonda Govt High School | ఇక్కడే ఉండండి సార్.. మమ్మల్ని విడిచి వెళ్లకండి ప్లీజ్



