Patnam Narender Reddy | ప్రజా పాలనే కదా..! భయమెందుకు రేవంత్ రెడ్డి..!!
Patnam Narender Reddy | ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ కొడంగల్‌కు వెళ్తున్న తమను ఆపడం ఏంటని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా పాలనే కదా.. భయమెందుకు రేవంత్ రెడ్డి అని నిలదీశారు.
Patnam Narender Reddy | త్రినేత్ర న్యూస్ : ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ కొడంగల్‌కు వెళ్తున్న తమను ఆపడం ఏంటని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా పాలనే కదా.. భయమెందుకు రేవంత్ రెడ్డి అని నిలదీశారు.
వికారాబాద్ జిల్లా పరిగి వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ సర్పంచ్ చిన్నప్ప మృతి చెందడంతో పరామర్శించేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏమిటని పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్గిలో మృతి చెందిన కార్యకర్తల అంత్యక్రియలకు వెళ్తుండగా పరిగి వద్ద అడ్డుకున్నారని నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేతలను అడ్డుకుని, కేసులు పెట్టడం సరైంది కాదని మండిపడ్డారు. చివరకు అంత్యక్రియలకు వెళ్లకుండా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇది దుర్మార్గపు పాలననా..? ప్రజా పాలననా? అని ప్రశ్నిస్తున్నామన్నారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి తన జన్మదిన వేడుకలకు మూడు రోజులకు రోజుకు రూ. 50 కోట్ల చొప్పున ఖర్చు పెట్టారు. అదే రైతులు, ప్రజలు కరువుతో అల్లాడుతుంటే.. రేవంత్ రెడ్డినేమో ఊరురా బర్త్‌డే వేడుకలు నిర్వహించి, విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రూ. 150 కోట్లు రైతుబంధు, పంట బోనస్‌కు ఖర్చు చేసి ఉంటే.. రైతులు సంతోషపడేవారు అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Egg Chicken Price Increase | కోడిగుడ్లు, చికెన్ ధరలు జెట్ స్పీడ్.. కొండెక్కుతున్న ధరల వెనుక అసలు రహస్యం ఇదే!
నవంబర్ 9, 2026

Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
నవంబర్ 9, 2026

Nalgonda Fake Death Certificate Scam | రిటైర్డ్ ఉద్యోగి డ్యూటీలోనే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్.. రూ.16 లక్షల డీల్.. ప్రభుత్వ జాబ్ కొట్టారు
నవంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Egg Chicken Price Increase | కోడిగుడ్లు, చికెన్ ధరలు జెట్ స్పీడ్.. కొండెక్కుతున్న ధరల వెనుక అసలు రహస్యం ఇదే!
- ●Papiya Adhikari | టపాసులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- ●Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Gold Investment | రూ.50 వేలతో బంగారం కొనాలా? ఆభరణాలు, నాణేలు, డిజిటల్ గోల్డ్‌లో ఏది బెటర్?
- ●China Lab Grown Gold | ల్యాబ్ గోల్డ్ మోసం: చైనా సరికొత్త దందా..!
- ●Bhogi Movie | మరోసారి శర్వానంద్ `భోగి` విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?

Egg Chicken Price Increase | కోడిగుడ్లు, చికెన్ ధరలు జెట్ స్పీడ్.. కొండెక్కుతున్న ధరల వెనుక అసలు రహస్యం ఇదే!

Papiya Adhikari | టపాసులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు : మంత్రి పొన్నం ప్రభాకర్

Gold Investment | రూ.50 వేలతో బంగారం కొనాలా? ఆభరణాలు, నాణేలు, డిజిటల్ గోల్డ్‌లో ఏది బెటర్?



