Ramchander Rao | దక్షిణ భారతదేశంలో అత్యధిక నిరుద్యోగిత రేటు తెలంగాణలోనే..: బీజేపీ స్టేట్‌చీఫ్ రామచందర్ రావు
Ramchander Rao | రాష్ట్రంలో నిరుద్యోగ (Unemployment) సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (Ramchander Rao) అన్నారు. దక్షిణ భారతదేశంలోనే (South India) అత్యధికంగా 6.8 శాతం నిరుద్యోగిత రేటు తెలంగాణలో (Telangana) ఉందని చెప్పారు.
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో నిరుద్యోగ (Unemployment) సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (Ramchander Rao) అన్నారు. దక్షిణ భారతదేశంలోనే (South India) అత్యధికంగా 6.8 శాతం నిరుద్యోగిత రేటు తెలంగాణలో (Telangana) నమోదవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు ఉద్యోగాలు లేవు.. క్యాలెండర్ (Job Calendar) లేదంటూ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీల అమలూ లేదని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై బీజేపీ యువమోర్చ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, అందుకే విద్యార్థుల న్యాయమైన హక్కు కోసం భారతీయ జనతా యువమోర్చా (BJP Yuva Morcha) ఈ అంశాన్ని ఉద్యమంగా చేపట్టిందని వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fees Reimbursement) బకాయిలను పూర్తిగా విడుదల చేసే వరకు తమ పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వెనక్కి తగ్గదని తెలిపారు.
హైకోర్టు చీవాట్లు పెట్టినా..
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి విద్యార్థుల హక్కులను సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు (High Court) ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, చీవాట్లు పెట్టినా ఈ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విద్యార్థులంతా శాంతియుతంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ మాత్రమే కాదు... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress) విద్యార్థులకు, యువతకు ఇచ్చిన ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమల స్థాపన వంటి అన్ని హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ.. బీజేవైఎం (BJYM), మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను ఏకం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై విస్తృత ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ప్రతి విద్యార్థికి అండగా నిలుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






