త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kethavath Ramakrishna | రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామకృష్ణ నియామకం.. అభినంద‌న‌లు తెలిపిన జాతీయ అధ్య‌క్షులు

Kethavath Ramakrishna | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెతావత్ రామకృష్ణను నియమిస్తున్నట్లు ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు మాజీ సభ్యులు ఉదిత్ రాజ్ తెలిపారు. 21 రాష్ట్రాల అధ్యక్షులు, ప్రతినిధుల సమక్షంలో రామకృష్ణకు నియామక పత్రం అందించి అభినంద‌న‌లు తెలిపిన‌ట్లు పేర్కొన్నారు.

S

Telangana | Published On Jun 22, 2026, 4.23 pm IST

Kethavath Ramakrishna | రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామకృష్ణ నియామకం.. అభినంద‌న‌లు తెలిపిన జాతీయ అధ్య‌క్షులు
Advertisement

Kethavath Ramakrishna | త్రినేత్ర‌.న్యూస్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెతావత్ రామకృష్ణను నియమిస్తున్నట్లు ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు మాజీ సభ్యులు ఉదిత్ రాజ్ తెలిపారు. జమ్మూక‌శ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో మూడు రోజుల పాటు ఉదిత్ రాజ్ అధ్యక్షతన జ‌రిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమాఖ్య జాతీయ సదస్సులో ఆయన ప్ర‌క‌టించారు. 21 రాష్ట్రాల అధ్యక్షులు, ప్రతినిధుల సమక్షంలో రామకృష్ణకు నియామక పత్రం అందించి అభినంద‌న‌లు తెలిపిన‌ట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో భారత రాజ్యాంగ వ్యాప్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ప్రజల అభ్యున్నతికి రామకృష్ణ కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ఉదిత్ రాజ్ వెల్ల‌డించారు. ప్రస్తుతం రామకృష్ణ హైదరాబాద్ డివిజన్ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్ల సంఘం జనరల్ సెక్రటరీగా, తెలంగాణ ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే గత కొన్ని సంవత్సరాలుగా భారత రాజ్యాంగ వ్యాప్తి కోసం కృషి చేస్తున్నార‌ని కొనియాడారు.

ఈ సందర్భంగా రామ‌కృష్ణ స్పందిస్తూ ఉదిత్ రాజ్, రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర్ రాజ్‌కు కృతజ్ఞతలు తెలియ‌జేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తాన‌ని, ఆర్గనైజేషన్ బలోపేతానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

Advertisement
Advertisement