Raksha Bandhan | మూడు తరాల అపురూప రక్షా ‘బంధం’..
Raksha Bandhan | రాఖీ పౌర్ణమి సందర్భంగా మూడు తరాల అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం పల్లెపాడు గ్రామంలో అపురూప దృశ్యంగా కనిపించింది.
పల్లెపాడు వేదికగా కన్నుల పండుగగా రాఖీ వేడుక..
Raksha Bandhan | త్రినేత్ర.న్యూస్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా మూడు తరాల అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం పల్లెపాడు గ్రామంలో అపురూప దృశ్యంగా కనిపించింది. వయసు పెరిగినా, తరాలు మారినా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు చెక్కుచెదరవని చాటిచెప్పేలా జరిగిన ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది.

నాగారం గ్రామ సర్పంచ్, 96 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డికి ఆయన 98 ఏళ్ల అక్క అండమ్మ, చెల్లెలు వసంతమ్మ రాఖీ కట్టి తమ్ముడిపై అపారమైన ప్రేమను కురిపించారు. అనంతరం రామచంద్రారెడ్డి తన సోదరి కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. వయసు పెరిగినా ఆత్మీయతకు వయసు లేదని చాటిచెప్పిన ఈ దృశ్యం పలువురి హృదయాలను హత్తుకుంది.

అదే కుటుంబంలో మరో తరం అనుబంధం కూడా రాఖీ పండుగ సందర్భంగా మరింత అందంగా కనిపించింది. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి ఆయన సోదరీమణులు భారతమ్మ, రేణుక రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఇక మూడో తరంలో గుంటకండ్ల జగదీష్ రెడ్డి తనయుడు వేమన్ రెడ్డికి ఆయన సోదరీమణులు భావన, లహరిలు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల ప్రేమను చాటుకున్నారు.

ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల రాఖీ బంధం పల్లెపాడు వేదికగా, చూసినవారికి కన్నుల పండుగగా నిలిచింది. కాలం మారినా,తరాలు మారినా అన్నాచెల్లెళ్ల అనుబంధం మాత్రం తరగదని చాటిచెప్పిన ఈ అపురూప ఘట్టం రాఖీ పండుగకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
సంబంధిత వార్తలు

Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
ఆగస్టు 26, 2026

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
జులై 12, 2026

BRS Party | ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు : అనిల్ బైరెడ్డి
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు
- ●ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం
- ●Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?
- ●వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్‌కు ‘కొండంత’ నొప్పి!
- ●Horoscope | సెప్టెంబర్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి!
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు

ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం

Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?

వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్‌కు ‘కొండంత’ నొప్పి!



