NDA Govt Delimitation Bill | ఈసారి ఆచి తూచి.. డీలిమిటేషన్ బిల్లు పెడదామా? వద్దా?
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీఏ డైలమాలో పడింది. గత ఏప్రిల్‌లో బిల్లు వీగిపోవడంతో, ఈసారి స్పెషల్ మెజారిటీపై పక్కా నమ్మకం వచ్చాకే సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
సంక్షిప్త సారాంశం
డీలిమిటేషన్ బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టడంపై ఎన్డీఏ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోంది. బిల్లు పాస్ కావడానికి సభలో 362 ఎంపీల (స్పెషల్ మెజారిటీ) మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం కూటమి బలం 318 మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ కోసం డీఎంకే, ఎన్సీపీ, వైసీపీ తదితర పార్టీలతో కేంద్రం ముమ్మర సంప్రదింపులు జరుపుతోంది. నంబర్‌పై పక్కా గ్యారెంటీ వస్తేనే, రెండు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది.
- తీవ్ర డైలమాలో ఎన్డీఏ ప్రభుత్వం
- 2/3 మెజారిటీ నంబర్ కోసం
- విపక్షాలతో సంప్రదింపులు
- రెండు రోజుల సెషన్ కు వీలుగా
- సభను ఇంకా ప్రొరోగ్ చేయని వైనం
- ఏప్రిల్ సెషన్ లో 54 ఓట్ల తేడాతో బిల్లు తిరస్కరణ
- బిల్లు ఆమోదానికి అవసరమైన బలం 360
- లోక్ సభలో ప్రస్తుత ఎన్డీఏ బలం 318
- 30 మంది ఎంపీలున్న డీఎంకే, ఎన్సీపీల పై ఎన్డీఏ ఆశ
- మరో 12 మంది ఎంపీల బలం కోసం సంప్రదింపులు
- నంబర్ పై నమ్మకం కుదిరాకే.. బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన
ఏప్రిల్ 17 నాటి బిల్లు
మొత్తం సభ్యులు - 543
ఓటింగ్ కు హాజరైన సభ్యులు - 528
ఆ రోజు అవసరమైన స్పెషల్ మెజారిటీ 352
బిల్లుకు అనుకూలంగా ఓట్లు 298
తక్కువ పడిన ఓట్లు 54
ప్రస్తుత పరిస్థితి
మొత్తం సభ్యులు - 543
ఒకవేళ ఓటింగ్ కు అందరూ హాజరైతే
అవసరమైన స్పెషల్ మెజారిటీ 362
ప్రస్తుత ఎన్డీఏ బలం 292
తృణమూల్ రెబెల్ ఎంపీలు 20
శివసేన (యూబీటీ) రెబెల్ 6
ఆ రెండు పార్టీల మద్దతు కలిపితే 318
22 డీఎంకే ఎంపీలు మద్దతిస్తే... 340
8 మంది ఎంపీలున్న ఎన్సీపీతో 348
ఇంకా అవసరమైన నంబర్ 12
త్రినేత్ర.న్యూస్ : ఒక్క ఎంపీ ఉన్న పార్టీతో కూడా ఏకంగా ప్రధాని స్థాయిలో భేటీ జరిపి.. డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న బీజేపీకి ..ఇప్పుడూ కొత్త భయం పట్టుకున్నది. గత ఏప్రిల్ లో విఫలమైనట్టు మళ్లీ గనుక బిల్లు వీగిపోతే..ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం చెదిరిపోయి ప్రతిపక్షాలు చెలరేగిపోతాయని ఆందోళన పడుతున్నది. 2 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించేందుకు అనుగుణంగానే సభను కేవలం నిరవధికంగా వాయిదా వేసి..ప్రోరోగ్ చేయకుండా ఉంచింది. 2/3 మెజారిటీ నంబర్ తమకు లభించిందన్న నమ్మకం కుదిరిన తర్వాతే.. ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నది. ఇటీవల జెన్ జీ ఉద్యమం, బాంకీపూర్ శాసనసభ నియోజకవర్గ ఓటమి.. ప్రభుత్వాన్ని కుదిపేయడంతో ఆచితూచి అడుగేయాలని ఎన్డీఏ భావిస్తున్నది.
బలం పెరిగింది...
డీలిమిటేషన్ కు ముడిపెడుతూ ఏప్రిల్ 17న లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు 54 మంది ఎంపీల మద్దతు దక్కకపోవడంతో వీగిపోయింది. వాస్తవానికి 543 మంది ఎంపీలున్న లోక్ సభ లో 2/3 మెజారిటీ కావాలంటే 362 మంది ఎంపీలు అవసరం. ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏ బలం 292. ఇటీవల తృణమూల్ నుంచి విడిపోయిన ఎంపీలు 20 మంది, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నుంచి విడిపోయిన 6 మంది ని కలుపుకుంటే సంఖ్యా బలం 318కి పెరుగుతుంది. ఒక వేళ 22 మంది ఎంపీలున్న డీఎంకే, 8 మంది ఎంపీలున్న ఎన్సీపీ షరతులతో కూడిన మద్దతిస్తే.. ఆ సంఖ్య 348కు పెరుగుతుంది. అప్పటికి మరో 14 మంది ఎంపీలు అవసరం అవుతారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ (4గురు ఎంపీలు), జేఎంఎం ( 3), వీసీకే (2), ఆర్ ఎల్ పీ (1) అకాలీ దళ్ (1)లతో పాటు మరికొందరు ఇండిపెండెంట్ ఎంపీల మద్దతు కోసం ఎన్డీఏ అభ్యర్థించనుంది. అయితే.. బడ్జెట్ సెషన్ కు కొనసాగింపు గా జరిగిన సమావేశాల్లో లోక్ సభలో ఓటింగ్ లో కేవలం 528 మంది మాత్రమే పాల్గొన్నారు. ఈ ప్రకారం దాదాపు 352 ఓట్లు అవసరం ఉండగా బిల్లుకు మద్దతుగా కేవలం 298 ఓట్లు మాత్రమే పడ్డాయి. విపక్షాలన్నీ కలిపి బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు వేశాయి. ఇంకా 54మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా అది సాధ్యం కాకపోవడంతో బిల్లు వీగిపోయింది.
నమ్మకం కుదరడం లేదు
ప్రత్యేక మెజారిటీ కోసం అవసరమైన ఎంపీల సంఖ్య 362. కొన్ని పరిస్థితుల్లో కొన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకించకుండా వాకౌట్ చేస్తుంటాయి. ఒక వేళ డీఎంకే (22), ఎన్సీపీ (8) వాకౌట్ చేస్తే మొత్తం ఓటు వేసే సభ్యుల సంఖ్య 562 నుంచి 532కు పడిపోతుంది. అప్పుడు ప్రత్యేక మెజారిటీకి అవసరమైన బలం 354కు పడిపోతే.. బిల్లు మరోసారి చిక్కుల్లో పడిపోయే ప్రమాదం ఉంది. తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుత డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ.. లోక్ సభలో ఎంపీల సంఖ్య 543 ఉండాలంటూ తీర్మానించింది. అక్కడి ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే కూడా దాదాపుగా ఇదే తీర్మానానికి కట్టుపడితే.. బిల్లుకు అవసరమైన మద్దతు లభించనట్టే. చిన్నా చితక పార్టీల ఎంపీలందరినీ కలుపుకున్నా.. డీఎంకే మద్దతు ఇవ్వకపోయినా.. వాకౌట్ చేసినా బిల్లు మరోసారి చిక్కుల్లో పడినట్టేనని బీజేపీ భావిస్తున్నది. జంతర్ మంతర్ ఆందోళనలతో చిక్కుల్లో పడిపోయిన బీజేపీ ప్రభుత్వం.. అదే వరుసలో బాంకీపూర్ లో ఓటమి పాలు కావడంతో తీవ్ర అంతర్ మథనంలో పడిపోయింది.బిల్లు మద్దతు కోసం చర్చలు జరుపుతున్నప్పటికీ.. ప్రత్యేక సమావేశాల కోసం ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. బిల్లు వీగిపోతే జరిగే నష్టాన్ని ఈ సారి ఎలా భరించాలో తెలియక సతమవుతున్నది. అందుకే డీలిమిటేషన్ బిల్లుపై కాస్త వెనుంజ వేసింది. మెజారిటీ నంబర్ పై స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Raviteja | క్లాస్ డైరెక్టర్‌తో రవితేజ హారర్ మూవీ - ఊహించని కాంబో సెట్
- ●Hyderabad Traffic Advisory | ఆదివారం నీట్ పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ఆ రూట్లలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
- ●Tummala Nageshwar Rao | యాంత్రీకరణ పథకం.. ఈసారి సబ్సిడీ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకే..
- ●KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాఖీ కట్టిన మహిళా నేతలు
- ●RS Praveen Kumar | కాంగ్రెస్ మంత్రులపై కూడా ఇలాగే దౌర్జన్యం చేస్తారా..?
- ●Telugu Serial Actor | రెండో పెళ్లి చేసుకున్న మొగలి రేకులు సీరియల్ నటి - ఇన్‌స్టా పోస్ట్‌తో భర్తను పరిచయం చేసిన శిరీష!

Raviteja | క్లాస్ డైరెక్టర్‌తో రవితేజ హారర్ మూవీ - ఊహించని కాంబో సెట్

Hyderabad Traffic Advisory | ఆదివారం నీట్ పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ఆ రూట్లలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

Tummala Nageshwar Rao | యాంత్రీకరణ పథకం.. ఈసారి సబ్సిడీ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకే..

KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాఖీ కట్టిన మహిళా నేతలు




