MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
MLA Jagadish Reddy | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో నీళ్లు నింపితే.. భద్రాచలంతో పాటు 44 ఊర్లు కొట్టుకుపోతాయంటూ రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
MLA Jagadish Reddy | త్రినేత్ర.న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో నీళ్లు నింపితే.. భద్రాచలంతో పాటు 44 ఊర్లు కొట్టుకుపోతాయంటూ రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నిన్న ప్రెస్ మీట్‌లో ముఖ్యమంత్రి అరుపులు, పెడబొబ్బలు, హుంకరింపులు, బెదిరింపులు, ఏడుపులు అన్నీ ప్రజలు చూశారు. రికార్డు స్థాయిలో గోదావరి నదికి ఏకకాలంలో 290 టీఎంసీల వరద ప్రవాహం వచ్చినా.. భద్రాచలం ఎన్నడూ మునిగిపోలేదని గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏ మూర్ఖుడు చెప్పిండో తెలియదు. 290 టీఎంసీల వరద వచ్చినా భద్రాచలంకు ఏం కాలేదు. సీఎం పదవి పిచ్చిలో పడి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జ్ఞాపకశక్తి తగ్గింది. కేవలం 6-7 టీఎంసీల నీళ్లతో భద్రాచలం మునిగిపోతుందా..? దీనిపై దమ్ముంటే చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి? అని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జ్ఞానం తెచ్చుకొండి.. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించండి అని ఆయన సూచించారు.
రేవంత్ నరహంతకుడిలా మాట్లాడుతున్నాడు..
నిన్న షాబాద్‌లో ఒక సైకో ఆరుగురిని దారుణంగా చంపిన సంఘటనకు, ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రెస్ మీట్‌కు పైసా కూడా తేడా లేదు. ఇద్దరిదీ ఒకటే రకమైన మానసిక తత్వంగా కనిపిస్తోంది. ఆయన కుంభకోణాలను, ధనదాహాన్ని ఎండగడుతూ, తెలంగాణపై చూపిస్తున్న విద్వేషాన్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు బీఆర్ఎస్ నేతల రక్తం చూడాలని రేవంత్ నరహంతకుడిలా మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతా అని అంటుండు. కేసీఆర్ రక్తం చెమటగా మారి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రేవంత్ రెడ్డికి మా రక్తం కావాలంటే కేటీఆర్‌తో సహా అందరం సిద్ధంగా ఉన్నామని జగదీశ్ రెడ్డి తెలిపారు.
'జైల్లో పెడతా' అంటూ రిటైర్డ్ ఇంజినీర్లకు కూడా బెదిరింపులు..
నాడు రిటైర్డ్ ఇంజినీర్ల పేరు చెప్పి మేడిగడ్డపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. నేడు అదే ఇంజినీర్లు కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని చెప్పినందుకు జైలుకు పంపుతామంటూ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఇంజినీర్లు తెలంగాణ వాదులుగా మాత్రమే మాట్లాడుతున్నారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్లు ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ కోసమే తాపత్రయపడ్డారు, వచ్చిన తర్వాత ఇక్కడి రైతాంగానికి నీళ్లు ఎలా ఇవ్వాలనే దానిపైనే ప్రయాసపడ్డారు. మీ కమిషన్లు, మీ కేసులు, మేడిగడ్డ పైన మీ సోది, మీ మూర్ఖపు ప్రచారాలకు వారెప్పుడూ అడ్డం పడలేదు. కానీ ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతుంటే జైల్లో పెడతామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? అని జగదీశ్ రెడ్డి నిలదీశారు.
కేసీఆర్ వస్తే లాగులు తడుపుకుంటారు..
ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహుల చేతిలో ఆయుధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిది రాక్షస మనస్తత్వం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి కేసులు పెట్టాలో డీజీపీ ఆలోచించాలి. రేవంత్ రెడ్డిని చీడ పురుగు అంటే సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వాస్తవాలు మాట్లాడితే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తారా...? రేవంత్ రెడ్డి పాలనలో 50 శాతం నేరాలు పెరిగాయి. డీజీపీ ఏం రివ్యూ చేస్తున్నారు. వీళ్లకు అసెంబ్లీ పెట్టే దమ్ము ఉందా..? కేసీఆర్ వస్తే లాగులు తడుపుకుంటారు. బీజేపీ,కాంగ్రెస్ ఒక్కటే. తెలంగాణలో ఉన్నది హైబ్రిడ్ కాంగ్రెస్ అని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
- ●Raksha Bandhan | మూడు తరాల అపురూప రక్షా 'బంధం'..
- ●Niloufer Hospital | నిలోఫర్‌కు పోటెత్తిన రోగులు.. రోజుకు కొత్తగా 100 మంది చేరిక
- ●SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్రయాణం.. రూ. 1.28 కోట్ల జరిమానా
- ●Irumudi Movie | రవితేజ ఇరుముడి వర్కింగ్ స్టిల్స్
- ●Lokesh Kanagaraj | ఒకే సారి రెండు ఓటీటీలలోకి లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ - 25 కోట్ల బడ్జెట్ - వంద కోట్ల కలెక్షన్స్
- ●NDA Govt Delimitation Bill | ఈసారి ఆచి తూచి.. డీలిమిటేషన్ బిల్లు పెడదామా? వద్దా?

Raksha Bandhan | మూడు తరాల అపురూప రక్షా 'బంధం'..

Niloufer Hospital | నిలోఫర్‌కు పోటెత్తిన రోగులు.. రోజుకు కొత్తగా 100 మంది చేరిక

SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్రయాణం.. రూ. 1.28 కోట్ల జరిమానా

Irumudi Movie | రవితేజ ఇరుముడి వర్కింగ్ స్టిల్స్





