BRS Party | ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు : అనిల్ బైరెడ్డి
BRS Party | సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ పర్యటన సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై చేసిన విమర్శలను ఎన్నారై బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి తీవ్రంగా ఖండించారు.
BRS Party | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ పర్యటన సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై చేసిన విమర్శలను ఎన్నారై బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి తీవ్రంగా ఖండించారు.
నల్గొండ ముద్దు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండి కొట్లాడడమే కాకుండా, నల్గొండ జిల్లాని మంత్రి హోదాలో ఎంతో అభివృద్ధి చేసిన జగదీశ్‌రెడ్డిపై చిల్లర వ్యక్తిగత విమర్శలు చేయడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. జిల్లా పర్యటనలు చేసినప్పుడు ప్రజలు సీఎం నుండి అభివృద్ధిని ఆశిస్తారని కానీ, రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా రోజు రోజుకి తన స్థాయి మరిచి వీలైనంత సంస్కారహీనంగా మాట్లాడే దాంట్లో తనకు తానే పోటీ పడి మాట్లాడి ప్రజల్లో చులకన అవుతున్నారని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ ఎన్నడూ చూడని అభివృద్ధిని చూసిందని, పేరుకే నల్గొండ కాంగ్రెస్ లో పెద్ద నాయకులు ఉన్నారని, వారి వల్ల ఏమీ ఉపయోగంలేదని, కానీ ఒక్కడే జగదీశ్‌రెడ్డి ఇతర నాయకులని కూడా ముందుండి నడిపించి నల్గొండ ప్రజల కష్టాలు తీర్చాడని వివరించారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలపై దృష్టి పెట్టాలని, రానున్న రెండు సంవత్సరాలైనా ఇచ్చిన హామీలని అమలు చేసే విధంగా పని చేయాలనే లేకుంటే, నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గెలవకుండా చూస్తామని, నల్గొండ బిడ్డగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని అనిల్ బైరెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Raksha Bandhan | మూడు తరాల అపురూప రక్షా 'బంధం'..
- ●Niloufer Hospital | నిలోఫర్‌కు పోటెత్తిన రోగులు.. రోజుకు కొత్తగా 100 మంది చేరిక
- ●SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్రయాణం.. రూ. 1.28 కోట్ల జరిమానా
- ●Irumudi Movie | రవితేజ ఇరుముడి వర్కింగ్ స్టిల్స్
- ●Lokesh Kanagaraj | ఒకే సారి రెండు ఓటీటీలలోకి లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ - 25 కోట్ల బడ్జెట్ - వంద కోట్ల కలెక్షన్స్
- ●NDA Govt Delimitation Bill | ఈసారి ఆచి తూచి.. డీలిమిటేషన్ బిల్లు పెడదామా? వద్దా?

Raksha Bandhan | మూడు తరాల అపురూప రక్షా 'బంధం'..

Niloufer Hospital | నిలోఫర్‌కు పోటెత్తిన రోగులు.. రోజుకు కొత్తగా 100 మంది చేరిక

SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్రయాణం.. రూ. 1.28 కోట్ల జరిమానా

Irumudi Movie | రవితేజ ఇరుముడి వర్కింగ్ స్టిల్స్





