Lokesh Kanagaraj | ఒకే సారి రెండు ఓటీటీలలోకి లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ – 25 కోట్ల బడ్జెట్ – వంద కోట్ల కలెక్షన్స్
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ మూవీ థియేటర్లలో వంద కోట్లకుపైగా వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రొమాంటిక్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంలో తెలుగులో రిలీజ్ అవుతోంది.
Entertainment | Published On Aug 28, 2026, 7.54 pm IST
Lokesh Kanagaraj | డీసీ మూవీతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే హీరోగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్నాడు. రొమాంటిక్ యాక్షన్‌గా తెరకెక్కిన డీసీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సంజన కృష్ణమూర్తి ఓ కీలక పాత్రలో కనిపించింది.
రెండు ఓటీటీలలో...
థియేటర్లలో నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టిన డీసీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్ ఓటీటీలలో డీసీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.
అనిరుధ్ మ్యూజిక్...
డీసీ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. దేవదాసు కథను మోడ్రనైజ్ చేసి దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాను తెరకెక్కించారు. అతడి టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్‌తో పాటు లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి యాక్టింగ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌తో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కేవలం ఇరవై ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
దేవదాస్ ప్రేమకథ...
సర్కార్ ...పోలీస్ వ్యవస్థలోని అవినీతిని ఎదురిస్తుంటాడు. అతడి గ్యాంగ్‌లో దేవదాస్ (లోకేష్ కనగరాజ్) కీలక సభ్యుడిగా ఉంటాడు. దేవదాస్‌ను పట్టుకోవడానికి భోజరాజు (గురు సోమసుందరం) అనే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నియమితుడవుతాడు. పార్వతి అనే పబ్ సింగర్‌తో దేవదాస్ ప్రేమలో ప్రేమలో పడతాడు. దేవదాస్ పై జరిపిన ఎటాక్‌లో భోజరాజ్ పార్వతిని చంపేస్తాడు. ఆ తర్వాత దేవదాస్ లైఫ్‌లోకి చంద్ర (వామికా గబ్బి) అనే వేశ్య ఎంటరవుతుంది. తనకు స్వేచ్ఛజీవితాన్ని ప్రసాదించిన దేవదాస్‌ను చంద్ర ఇష్టపడుతుంది. చంద్ర ప్రేమను దాస్ అర్థం చేసుకున్నాడా? దాస్ గ్యాంగ్‌లోని అందరిని భోజరాజ్ ఎలా చంపాడు? తన వారి చావుపై చంద్రతో కలిసి దాస్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Mallya | విజయ్ మాల్యా జీవితంపై వెబ్‌సిరీస్ – టైటిల్ రోల్లో భగవంత్ కేసరి విలన్
ఆగస్టు 30, 2026

Nani Paradise | డల్లాస్ గడ్డపై మారుమోగిన తెలంగాణ జానపదం – ప్యారడైజ్ నుంచి ఏషనాగుల సాంగ్ రిలీజ్
ఆగస్టు 29, 2026

Ott Releases This Week | ఈ వారం ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఒక్కోటి ఒక్కో జానర్
ఆగస్టు 28, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



