త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేప‌ల మార్కెట్‌

Vakiti Srihari | జాతీయ మత్స్యకారుల దినోత్సవం సంద‌ర్భంగా మత్స్యకారులకు సీఎం రేవంత్ రెడ్డి అద్భుత కానుక అంద‌జేశార‌ని మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి, ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోహెడలో రూ. 47.03 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఎగుమతి హోల్ సేల్ చేపల మార్కెట్‌కు శుక్ర‌వారం శంకుస్థాపన చేసిన‌ట్లు తెలిపారు.

S

Telangana | Published On Jul 10, 2026, 1.52 pm IST

Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేప‌ల మార్కెట్‌
Advertisement
  • కోహెడ‌లో శంకుస్థాప‌న చేసిన మంత్రి వాకిటి, ఎంపీ చామ‌ల‌

త్రినేత్ర‌.న్యూస్‌: జాతీయ మత్స్యకారుల దినోత్సవం సంద‌ర్భంగా మత్స్యకారులకు సీఎం రేవంత్ రెడ్డి అద్భుత కానుక అంద‌జేశార‌ని మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి, ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోహెడలో రూ. 47.03 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఎగుమతి హోల్ సేల్ చేపల మార్కెట్‌కు శుక్ర‌వారం శంకుస్థాపన చేసిన‌ట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల, ముఖ్యంగా మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ప్ర‌భుత్వం కట్టుబడి ఉంద‌న్నారు.


బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతి కోసం మరో చ‌రిత్రాత్మక అడుగు వేసింది. నేడు జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ ప్రాంతంలో 'ఎగుమతి హోల్ సేల్ చేపల మార్కెట్' (Export Wholesale Fish Market) నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం సంతోషకరం. మత్స్యకారులకు చెక్కుల పంపిణీ చేశాం అని వాకిటి, చామ‌ల పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరేట్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మత్స్యకార సొసైటీల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement