త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chukka Ramaiah Birthday | విద్యారంగానికి చుక్కా రామయ్య సేవలు ప్రశంసనీయం

Chukka Ramaiah Birthday | ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం.. 101వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి రామయ్య చేసిన కృషిని ప్రశంసించారు.

P

Telangana | Published On Nov 20, 2026, 4.35 pm IST

Chukka Ramaiah Birthday | విద్యారంగానికి చుక్కా రామయ్య సేవలు ప్రశంసనీయం
Advertisement
  • విద్యారంగానికి ఆయన చేసిన కృషి మరువలేనిది
  • 101వ జన్మదిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

Chukka Ramaiah Birthday | ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం.. 101వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి రామయ్య చేసిన కృషిని ప్రశంసించారు. స్వాతంత్య్ర ఉద్య‌మం, తెలంగాణ ఉద్యమంలో చుక్కా రామయ్య చురుకైన పాత్ర పోషించారని సీఎం గుర్తుచేశారు. ఈ ప్రాంత విద్యార్థులకు ఐఐటీ అనే పదాన్ని పరిచయం చేసిన ఘనత ఆయనదేనన్నారు. ఎమ్మెల్సీగా శాసనమండలిలోనూ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని, వాటికి పరిష్కారాలను సూచించారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం గర్వకారణమన్నారు.

మ‌రింత కాలం స‌మాజానికి స్ఫూర్తిగా నిల‌వాల‌ని ఆకాంక్ష‌

పార్టీ బలాబలాలతో సంబంధం లేకుండా వారిద్దరికీ మాట్లాడేందుకు సభలో అవకాశం కల్పించేవారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాలలు లేకపోయిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదని, రామయ్య శాసనమండలిలో ప్రస్తావించిన తర్వాతే ఆ సమస్యపై చర్చ జరిగిందని గుర్తుచేశారు. రాజకీయ నాయకులు సుదీర్ఘ ప్రసంగాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపాలని రేవంత్ రెడ్డి సూచించారు. చుక్కా రామయ్య సంపూర్ణ ఆరోగ్యంతో మరింతకాలం సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి, రవినారాయణరెడ్డి, చుక్కా రామయ్య వంటి మహనీయుల సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ప్రజల పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేసిన ఇలాంటి నాయకులకు రాజకీయాలకు అతీతంగా అరుదైన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. చుక్కా రామయ్య ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement