Gattu Ramachandra Rao | రేవంత్ ఇంపల్ చెట్టు లాంటోడు
Gattu Ramachandra Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంపల్ చెట్టు లాంటోడని.. ఆయన ఇతరుల ఎత్తు గురించి మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్ రావు విమర్శించారు. సీఎం సిద్దిపేట బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని..కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై కథ చెప్పబోయి రేవంత్‌రెడ్డి బోల్తా పడ్డారని, కొత్త తిట్లను అరువు తెచ్చుకుని మాట్లాడారని మండిపడ్డారు.
- ఆయన బాడీలో ఏ పార్ట్ సరిగా ఉండదు
- ఇతరులను బాడీ షేమింగ్ చేస్తున్నరు
- సీఎం సిద్దిపేట సభ అట్టర్ ప్లాప్
- కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు
- దమ్ముంటే హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించాలి
- బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు
Gattu Ramachandra Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంపల్ చెట్టు లాంటోడని.. ఆయన ఇతరుల ఎత్తు గురించి మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్ రావు విమర్శించారు. సీఎం సిద్దిపేట బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని..కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై కథ చెప్పబోయి రేవంత్‌రెడ్డి బోల్తా పడ్డారని, కొత్త తిట్లను అరువు తెచ్చుకుని మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావును బాడీ షేమింగ్ చేయడం రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని గట్టు రాంచందర్ రావు అన్నారు. హరీశ్‌రావుకు సిద్దిపేటలోని ప్రతి ఇంటితో అనుబంధం ఉందని పేర్కొన్నారు. ‘‘చికెన్ షాప్ ముందు కోడి తొడగొడితే పరిస్థితి ఎలా ఉంటుంది? హరీశ్‌రావు ముందు రేవంత్‌రెడ్డి తొడగొడితే అంతే సంగతి. దమ్ముంటే హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించు రేవంత్‌రెడ్డి. సిద్దిపేటలో హరీశ్‌రావుపై పోటీ చేయి. ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది’’ అని సవాల్ విసిరారు.
తెలంగాణకు హరీశ్‌రావు కల్పవృక్షం
తాటి చెట్టు కల్పవృక్షమని, తెలంగాణకు హరీశ్‌రావు కూడా కల్పవృక్షం లాంటివారని అన్నారు. తాటి చెట్టు నుంచి వచ్చే ప్రతి వస్తువుకూ విలువ ఉంటుందని, అలాంటి చెట్టును నెగెటివ్ కోణంలో వర్ణించడం గౌడ కులస్థులను అవమానించడమేనని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి శరీరంలో ఏ పార్ట్ సరిగా ఉండదని, అయినా ఇతరులను బాడీ షేమింగ్ చేస్తారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలవాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని గట్టు రాంచందర్ రావు ఆరోపించారు. గతంలో చంద్రబాబు డబ్బులు పంచినా గెలవలేదని గుర్తుచేశారు. ‘గురువే ఓడిపోయాడు.. శిష్యుడు ఓడిపోడా?’ అని ప్రశ్నించారు. శంకరమ్మను పక్కన పెట్టుకుని రేవంత్‌రెడ్డి డ్రామా చేశారని, ఆమెను అన్ని విధాలుగా గౌరవించింది కేసీఆరేనని అన్నారు. శంకరమ్మను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు.
అమరవీరుల గురించి మాట్లాడడం విడ్డూరం
అమరవీరులకు నివాళులు అర్పించని రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అమరవీరుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముందుగా రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపించాలని వ్యాఖ్యానించారు. కమిషన్ల కాంగ్రెస్‌ను ప్రజలు ఛీకొడతారని విమర్శించారు. తిట్లు తిట్టడమే సీఎం పదవికి గొప్పతనమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, సహాయక చర్యల గురించి మాట్లాడకుండా ఈ తిట్ల రాజకీయాలు ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ స్కాంగ్రెస్‌గా మారిపోయిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎవరినో తొక్కడం కాదని, అసలు కాంగ్రెస్ నేతలే ఆయనను తొక్కడం ఖాయమని అన్నారు. బీజేపీలోకి వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీలోకి వెళ్తున్న అంశాన్ని డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మీడియా సమావేశంలో బొమ్మెర రామమూర్తి, వాడపల్లి మాధవ్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
- ●HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!
- ●OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్- టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్
- ●Gold ETF | బంగారం, వెండి ధరల పతనం ఎఫెక్ట్.. ఈటీఎఫ్‌లలో భారీ అమ్మకాలు..
- ●Chukka Ramaiah Birthday | విద్యారంగానికి చుక్కా రామయ్య సేవలు ప్రశంసనీయం
- ●CM Revanth Reddy | తెలంగాణ టార్గెట్.. దేశ జీడీపీలో 10 శాతం

Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు

HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!

OTT Releases This Week | ఈ వారం ఓటీటీలో 25 సినిమాలు రిలీజ్- టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్

Gold ETF | బంగారం, వెండి ధరల పతనం ఎఫెక్ట్.. ఈటీఎఫ్‌లలో భారీ అమ్మకాలు..




