Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా
Jagadeesh Reddy | తనకు వందల ఎకరాలు ఎక్కడున్నయో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (Radha Krishna) చెప్తే వాటిని లీగల్‌గా అమ్ముకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
- ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పని విషాయాలను ఆయనెలా రాశారు?
- కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెళ్లడానికి భట్టి ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేశారా లేదా సీఎం ఆ?
- ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లి విచారణ చేసే హక్కు మీకు ఎక్కడిది?
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉండాలి
- తెలంగాణకు కాంగ్రెస్ దయ్యం పట్టింది
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫైర్
Jagadeesh Reddy | త్రినేత్ర న్యూస్: తనకు వందల ఎకరాలు ఎక్కడున్నయో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (Radha Krishna) చెప్తే వాటిని లీగల్‌గా అమ్ముకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పని విషయాలను రాధాకృష్ణ ఎలా రాశారని ప్రశ్నించారు. రాధాకృష్ణనే వాళ్ళకు స్క్రిప్టు పంపారా? అని సందేహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లి విచారణ చేసే హక్కు కాంగ్రెసోళ్లకు ఎక్కడిదన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బుద్ధి, జ్ఞానం ఉండాలన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ దయ్యం పట్టిందని ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు, రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నాకు షాబాద్ మండలం మద్దూరు అనే గ్రామంలో భూమి ఉందని అఫిడవిట్ లో పెట్టాను. కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నాకు ఎయిర్‌పోర్టు పక్కనే విలువైన భూములున్నాయని పదే పదే చేసిన ఆరోపణలు వట్టివే అని తేలిపోయింది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పని విషయాలను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎలా రాశారు? నేను ప్రజల్లో ఉంటున్నా నా వార్తలు ఆంధ్రజ్యోతిలో ఎందుకు రావడం లేదు? నీ కాళ్ళు పట్టుకునే ఇక్కడి ముఖ్యమంత్రి మెప్పు కోసం మా మీద నెగటివ్ వార్తలు రాస్తున్నావా? సీసీ టీవీలు వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకుంటే తప్పా? ఆవులు, కోళ్లు అక్కడుంటాయ్.. అవి దొంగతనం కాకుండా సీసీ టీవీలు పెట్టుకోవద్దా? ఫామ్ హౌజ్‌లకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెళ్లడం వారి కుటుంబసభ్యులకు కూడా ఇష్టం లేదు. కాంగ్రెస్ నాయకులు వెళ్లాల్సింది. ప్రైవేట్ ఆస్తుల దగ్గరకు కాదు.. ప్రజల సమస్యల దగ్గరకు వెళితే బాగుంటుంది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది. మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు. కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ విప్‌లను, ఎమ్మెల్యేలను పంపించారు. మేం ఎప్పుడో అఫిడవిట్‌లో పెట్టిన అంశాలను మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కేసీఆర్ చావు కోరుకున్నారు. ఇందిరమ్మ ఎమెర్జెన్సీ కంటే దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంది. కృష్ణా, గోదావరి కింద రైతులకు సాగు నీరు ఇవ్వడం లేదు. మా ఆస్తులు ఎన్నికల అఫిడవిట్ లో ఉన్నాయి.
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడిగా హడావుడి ఎక్కువ చేస్తున్నారు. నేరస్తుల మాదిరిగా పక్కా వ్యూహంతో ఫామ్ హౌస్‌లపై దాడి చేద్దామని ప్రజా భవన్ వద్ద కాంగ్రెస్ వాళ్లు జమ అవుతున్నారు. అనుమతి లేకుండా ప్రయివేటు వ్యక్తుల ఇళ్లల్లోకి వెళ్లవద్దని మీకు తెలియదా? కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసింది ఎవరు? ప్రభుత్వం తరపున వెళ్ళారా? పార్టీ తరపున వెళ్ళారా? భట్టి విక్రమార్క మీకు ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేశారా లేక సీఎం ఏర్పాటు చేశారా?
ఐదు రోజులు తిరిగి మీరు సాధించింది ఏంటి? రాష్ట్రంలో అసలు సమస్యలు వేరే ఉన్నాయి. జనరేటర్లతో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటనలను కాంగ్రెస్ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ టూర్ సర్కస్ ను తలపిస్తోంది. దీనికి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. పోలీసులను పెట్టుకుని ఎందుకు వెళ్లారు. ఎల్ నినో పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇంకొక వ్యక్తి మోపయ్యారు. నీ దోస్తు శిష్యుడు సీఎం అయ్యాడని నీకు సంతోషం ఉండవచ్చు.
ఎండిపోయిన పంటలను ఎందుకు పరిశీలించరు?
సీసీ కెమెరాలను తప్పు పట్టిన వాళ్ళను నేను ఎప్పుడూ చూడలేదు. సీసీ కెమెరాలను చూసి నేరస్తులు భయపడతారు. సీసీ కెమెరాలను చూసి కాంగ్రెస్ నేతలకు ఎందుకు అంత భయం. కాంగ్రెస్ వాళ్లు గ్యాంగ్ లాగా తయారయ్యి ఫామ్ హౌస్ ల వద్దకు వెళ్లారు. కాంగ్రెస్ వాళ్లు ఎండిపోయిన పంటలను ఎందుకు పరిశీలించడం లేదు? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●ACB Raid RTO Bandlaguda Hyderabad | బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌పై ఏసీబీ మెరుపు దాడి.. అవినీతి బాగోతాలు బట్టబయలు
- ●Gold Price | బంగారం ధరలకు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?
- ●Asian Games 2026 | ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
- ●YTPS | యాదాద్రికి బొగ్గు కొరత.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
- ●Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం
- ●ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?

ACB Raid RTO Bandlaguda Hyderabad | బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌పై ఏసీబీ మెరుపు దాడి.. అవినీతి బాగోతాలు బట్టబయలు

Gold Price | బంగారం ధరలకు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?

Asian Games 2026 | ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

YTPS | యాదాద్రికి బొగ్గు కొరత.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి






